ప్రియుడితో.. కన్యాకుమారిలో నయనతార పూజలు..!

కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి హీరోయిన్ నయనతార పూజలు చేశారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని.. దాదాపు అరగంట సేపు వీరిద్దరూ ఆలయంలో ఉన్నారు. నయన్, విఘ్నేష్‌లకు ఆలయ పూజారులు ప్రత్యేక ఆహ్వానాన్ని పలికారు. ప్రస్తుతం నయనతార ఆర్.జె.బాలాజీ డైరెక్షన్‌లో ‘మూక్కుత్తి అమ్మన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చేసినన్ని రోజులూ ఆమె మాంసాహారాన్ని ముట్టుకోనని శపథం చేశారట. అత్యంత దీక్షతో నయన్ అమ్మవారి పాత్రలో నయనతార నటిస్తున్నట్టు […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:27 pm, Tue, 10 December 19
ప్రియుడితో.. కన్యాకుమారిలో నయనతార పూజలు..!

కన్యాకుమారిలోని భగవతి అమ్మన్ ఆలయంలో తన ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి హీరోయిన్ నయనతార పూజలు చేశారు. అనంతరం అమ్మవారి దర్శనం చేసుకుని.. దాదాపు అరగంట సేపు వీరిద్దరూ ఆలయంలో ఉన్నారు. నయన్, విఘ్నేష్‌లకు ఆలయ పూజారులు ప్రత్యేక ఆహ్వానాన్ని పలికారు. ప్రస్తుతం నయనతార ఆర్.జె.బాలాజీ డైరెక్షన్‌లో ‘మూక్కుత్తి అమ్మన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా చేసినన్ని రోజులూ ఆమె మాంసాహారాన్ని ముట్టుకోనని శపథం చేశారట. అత్యంత దీక్షతో నయన్ అమ్మవారి పాత్రలో నయనతార నటిస్తున్నట్టు బాలాజీ ఇదివరకే ప్రకటించారు. కాగా.. నయనతార ఇదివరకే భక్తి ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లోనూ మాంసాహారం తినేవారు కాదు. తెలుగులో ‘శ్రీ రామ రాజ్యం’ సినిమాలో బాలకృష్ణ సరసన సీత పాత్రలో నయనతార నటించింది. ఆ సందర్భంలోనూ.. ఆమె మాంసాహారాన్ని తినలేదు.