గుడ్ న్యూస్ః తొలి దశ నాసల్‌ స్ప్రేకు అనుమతి..!

. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. మరోవైపు, కొవిడ్‌ను ఎదుర్కొనే చికిత్సగానీ.. వ్యాక్సిన్‌గానీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల పరిశోధకులు టీకాల తయారికి పోరాటం చేస్తున్నారు.

గుడ్ న్యూస్ః తొలి దశ నాసల్‌ స్ప్రేకు అనుమతి..!
Follow us

|

Updated on: Oct 12, 2020 | 9:14 PM

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు బయటపడుతామా..? అంటూ జనం ఆశగా ఎదురుచూస్తుంది. నిత్యం లక్షలాది కొత్త కేసులు వెలుగుచూస్తుండగా, వేలాది మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రశాంతంగా ప్రాంతాలు కరోనా గుప్పిట్లో చిక్కుకుని విలవిలలాడుతున్నాయి. కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం చేస్తున్నారు. మరోవైపు, కొవిడ్‌ను ఎదుర్కొనే చికిత్సగానీ.. వ్యాక్సిన్‌గానీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ దేశాల పరిశోధకులు టీకాల తయారికి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం 170 దాకా వ్యాక్సిన్ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయి.

అటు, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు పరిశోధకులు కొత్త మార్గాలనూ అన్వేషిస్తూనే ఉన్నారు. కాగా, ఈ భయంకరమైన వైరస్‌ను ఎదుర్కొనేందుకు నాసల్‌ స్ప్రే చక్కగా పనిచేస్తుందని భావిస్తున్నారు నిపుణులు. వచ్చే నెలలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇది ఫ్లూతోపాటు కొవిడ్‌ను కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇన్‌ఫ్లుయెంజా, సార్స్‌ సీఓవీ-2ను ఎదుర్కొనే ప్రయోగాత్మక డుయెల్‌ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను వచ్చే నెలలో హాంకాంగ్‌లో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్‌ కోసం సుమారు 100 మంది వలంటీర్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ ట్రయల్స్‌ హాంకాంగ్‌ విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్‌ యుయెన్ క్వాక్-యుంగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. 9 సెప్టెంబర్ 2020న జియామెన్ విశ్వవిద్యాలయం, హాంకాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సంయుక్తంగా బీజింగ్ వాంటాయ్ బయోలాజికల్ ఫార్మసీ ఎంటర్‌ప్రైజెస్‌ ఈ ఇంట్రానాసల్‌ స్ప్రేను రూపొందించారు. ఇప్పటికే మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అనుమతి కూడా పొందారు. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇచ్చిన తొలి నాసల్‌ స్ప్రే ఇదే.

అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!