దేవుడి స్క్రిప్టులో చాలా ట్విస్టులున్నాయి : నారా లోకేశ్ ట్వీట్స్

ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ ట్వీట్టర్ వేదికగా తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. దేవుడు స్ట్రిప్టు రాస్తూ రాస్తూ మధ్యలో కామా పెట్టాడు.. ఇంకా పూర్తి చేయలేదు జగన్ గారూ..అది ఫుల్‌స్టాప్ అనుకుంటున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు.. అంటూ విరుచుకుపడ్డారు నారా లోకేశ్. దేవుడు.. కామా తర్వాత మళ్లీ స్క్రిప్టు రాయడం మెుదలుపెట్టాడని, మీరు పోలవరం అవినీతి అన్న పట్టిసీమ మోటార్లు మీతోనే […]

దేవుడి స్క్రిప్టులో చాలా ట్విస్టులున్నాయి : నారా లోకేశ్ ట్వీట్స్
Follow us

| Edited By:

Updated on: Jun 29, 2019 | 8:21 PM

ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేశ్ ట్వీట్టర్ వేదికగా తీవ్రస్ధాయిలో విమర్శలు చేశారు. దేవుడు స్ట్రిప్టు రాస్తూ రాస్తూ మధ్యలో కామా పెట్టాడు.. ఇంకా పూర్తి చేయలేదు జగన్ గారూ..అది ఫుల్‌స్టాప్ అనుకుంటున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు.. అంటూ విరుచుకుపడ్డారు నారా లోకేశ్.

దేవుడు.. కామా తర్వాత మళ్లీ స్క్రిప్టు రాయడం మెుదలుపెట్టాడని, మీరు పోలవరం అవినీతి అన్న పట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమమని మీరంటే.. అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్క్రిప్ట్‌లో ఇటువంటివి చాలానే ఉంటాయంటూ లోకేశ్ ఫైరయ్యారు.

ప్రజావేదిక కూల్చివేత, కరకట్టపై ఉన్న నిర్మాణాల కూల్చివేతకు సీఆర్డీఏ నోటీసులు, చంద్రబాబుకు సెక్యూరిటీ కుదింపు వంటివాటితో టీడీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ నేపధ్యంలో లోకేశ్ ట్వీట్స్ దుమారాన్ని రేపుతున్నాయి.ట్విట్టర్ వేదికగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. లోకేశ్ ట్వీట్స్‌పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.