బొత్సకు లోకేశ్ సూపర్ కౌంటర్.. ఏమన్నారంటే?

నారా లోకేశ్ రెచ్చిపోయారు. వైసీపీ నేతలను ఓ ఆటాడుకున్నారు. అమరావతిని గ్రాఫిక్స్ మాయాజాలం అంటారా అంటూ ఏపీ మంత్రులపై మండిపడ్డారు. రాజధానిపై జరుగుతున్న రగడపై లోకేశ్ తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసిరారు. ఏపీ రాజధానిపై నెలకొన్న రగడ గురువారం పీక్ ‌లెవల్‌కు చేరిన సంగతి తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తుండడంతో అమరావతి ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తున్నవారు..వ్యతిరేకిస్తున్న వారు ఆందోళనలకు, నిరసనలకు దిగడంతో అమరావతి ప్రాంతం గురువారం హీటెక్కింది. ఈ […]

బొత్సకు లోకేశ్ సూపర్ కౌంటర్.. ఏమన్నారంటే?
Follow us

|

Updated on: Nov 28, 2019 | 2:33 PM

నారా లోకేశ్ రెచ్చిపోయారు. వైసీపీ నేతలను ఓ ఆటాడుకున్నారు. అమరావతిని గ్రాఫిక్స్ మాయాజాలం అంటారా అంటూ ఏపీ మంత్రులపై మండిపడ్డారు. రాజధానిపై జరుగుతున్న రగడపై లోకేశ్ తనదైన శైలిలో పంచ్ డైలాగులు విసిరారు.

ఏపీ రాజధానిపై నెలకొన్న రగడ గురువారం పీక్ ‌లెవల్‌కు చేరిన సంగతి తెలిసిందే. టిడిపి అధినేత చంద్రబాబు రాజధానిలో పర్యటిస్తుండడంతో అమరావతి ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. చంద్రబాబు పర్యటనను స్వాగతిస్తున్నవారు..వ్యతిరేకిస్తున్న వారు ఆందోళనలకు, నిరసనలకు దిగడంతో అమరావతి ప్రాంతం గురువారం హీటెక్కింది. ఈ క్రమంలో టీవీ9తో మాట్లాడిన నారా లోకేశ్ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు.

రాజధానికి వచ్చి తాము కట్టిన నిర్మాణాలు చూడమని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు చినబాబు. చంద్రబాబు పర్యటనను వైసీపీ రాజకీయం చేస్తోందని లోకేశ్ ఆరోపించారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి రైతుల ముసుగులో టిడిపి నేతలపై దాడి చేశారని, రాజధాని ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్నారని ఆయన ఆరోపించారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఏమి మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని, నోటి కొచ్చినట్లు మాట్లాడటం కాదు.. నిర్మాణాలను చూసి మాట్లాడాలని సవాల్ చేశారు లోకేశ్. రాజధాని ప్రాంతంలో తానెందుకు ఇప్పటి వరకు పర్యటించలేదో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గతంలో తమపై అవినీతి ఆరోపణలు చేసిన వైసీపీ నేతలు.. తాము అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా వాటిని నిరూపించలేకపోయారని లోకేశ్ అన్నారు. వైసీపీ నేతలు దద్దమ్మలు, చేతకాని వాళ్ళంటూ ఘాటైన కామెంట్లు చేశారాయన. మీరు కేబినెట్ సమావేశం ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఎక్కడ్నించి పరిపాలన సాగిస్తున్నారు? ఆ భవనాలన్నీ గత టిడిపి ప్రభుత్వం నిర్మించినవి కావా? అని లోకేశ్ ప్రశ్నించారు. మొత్తానికి లోకేశ్ వ్యాఖ్యలు ఏపీలో పాలిటిక్స్‌ని హీటెక్కిస్తున్నాయి.