చీఫ్ మార్షల్‌పై ‘యూజ్‌లెస్ ఫెలో’ అంటూ విరుచుకుపడిన లోకేశ్..

మీడియాపై ఆంక్షలు పెడుతూ  ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 2430 వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ నిన్న వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు నిరసన తెల్పుతూ పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చారు. చేతిలో ప్లకార్డులు, నిరసన బ్యాడ్జీలు ఉండటంతో..వాటితో అనుమతి లేదంటూ మార్షల్స్ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ సమయంలో టీడీపీ నేతలకు, మార్షల్స్‌కు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చంద్రబాబుని అనుమతించకపోవడంతో…మాజీ మంత్రి  లోకేశ్ చీఫ్ మార్షల్‌పై తీవ్ర స్థాయిలో […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:06 am, Fri, 13 December 19
చీఫ్ మార్షల్‌పై 'యూజ్‌లెస్ ఫెలో' అంటూ విరుచుకుపడిన లోకేశ్..

మీడియాపై ఆంక్షలు పెడుతూ  ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 2430 వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష టీడీపీ నిన్న వాయిదా తీర్మానం ఇచ్చింది. ఆపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి చంద్రబాబు నిరసన తెల్పుతూ పాదయాత్రగా అసెంబ్లీకి వచ్చారు. చేతిలో ప్లకార్డులు, నిరసన బ్యాడ్జీలు ఉండటంతో..వాటితో అనుమతి లేదంటూ మార్షల్స్ చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలను అడ్డుకున్నారు. ఈ సమయంలో టీడీపీ నేతలకు, మార్షల్స్‌కు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. చంద్రబాబుని అనుమతించకపోవడంతో…మాజీ మంత్రి  లోకేశ్ చీఫ్ మార్షల్‌పై తీవ్ర స్థాయిలో ఫైర్యయ్యారు. యూజ్‌లెస్ ఫెలో, బుర్రుందా అంటూ విరుచుకుపడ్డారు. అసెంబ్లీ మెయిన్ గేట్స్‌ను తొసుకుంటూ తిట్లదండకం అందుకున్నారు.