అసలు ఆ ఆలోచనే రాకుండా చెయ్యాలి : బాలకృష్ణ

దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.  ఈ కేసులో నలుగురు నిందితులు ఈ తెల్లావారుజామున ఎన్‌కౌంటరయ్యారు.  ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. సామూహిక అత్యాచారానికి, హత్యకు..ఎన్‌కౌంటరే సరైన శిక్షని ఆయన అభిప్రాయపడ్డారు. భగవంతుడే పోలీసుల రూపంలో సరైన శిక్ష విధించారని, భవిష్యత్‌లో ఎవరికి ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని పేర్కొన్నారు. ఆడాళ్ల గొప్పతనం గురించి, భద్రతపై..తమ […]

  • Ram Naramaneni
  • Publish Date - 1:51 pm, Fri, 6 December 19
అసలు ఆ ఆలోచనే రాకుండా చెయ్యాలి : బాలకృష్ణ

దిశ ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే.  ఈ కేసులో నలుగురు నిందితులు ఈ తెల్లావారుజామున ఎన్‌కౌంటరయ్యారు.  ఈ విషయంపై తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఎన్‌కౌంటర్‌పై టాలీవుడ్ అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు.

సామూహిక అత్యాచారానికి, హత్యకు..ఎన్‌కౌంటరే సరైన శిక్షని ఆయన అభిప్రాయపడ్డారు. భగవంతుడే పోలీసుల రూపంలో సరైన శిక్ష విధించారని, భవిష్యత్‌లో ఎవరికి ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉండేందుకు ఇదే సరైన మార్గమని పేర్కొన్నారు. ఆడాళ్ల గొప్పతనం గురించి, భద్రతపై..తమ కుటుంబం ఎన్నో సందేశాత్మక చిత్రాలను అందించిందని తెలిపారు. నిందితులకు ఇంత మంచి గుణపాఠం అందించినందకు తెలంగాణ ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి బాలయ్య అభినందనలు తెలిపారు.