Balayya in KGF 2 : ‘కేజీఎఫ్ 2’ సినిమాలో బాలయ్య..! నందమూరి అభిమానులూ..ఇది విన్నారా..?

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ..బైరవ ద్వీపం, ఆదిత్య 369, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి లార్జెర్ దెన్ లైఫ్ ఉన్న పాత్రల్లో నటించారు. ఇలాంటి ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం పక్కనపెడితే బాలయ్య అంటేనే మాస్.

Balayya in KGF 2 :   'కేజీఎఫ్ 2' సినిమాలో బాలయ్య..! నందమూరి అభిమానులూ..ఇది విన్నారా..?
Follow us

|

Updated on: Dec 26, 2020 | 5:53 PM

టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ..బైరవ ద్వీపం, ఆదిత్య 369, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి లార్జెర్ దెన్ లైఫ్ ఉన్న పాత్రల్లో నటించారు. ఇలాంటి ప్రయోగాలకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం పక్కనపెడితే బాలయ్య అంటేనే మాస్. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్ వంటి సినిమాల ద్వారా బాలయ్య మాస్ ఆడియెన్స్ కు మరింత దగ్గరయ్యారు. అయితే ‘కేజీఎఫ్ 2’ లాంటి ఊర మాస్ సినిమాలో బాలయ్య నటిస్తే ఎలా ఉంటుంది. నందమూరి అభిమానుకు అయితే పూనకాలే. అదేంటి ‘కేజీఎఫ్ 2’లొ  హీరో యష్​ కదా బాలయ్య ఇందులో ఉన్నారా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే 

‘కేజీఎఫ్ 2’ సినిమా క్యాస్ట్​ అని గూగుల్​లో సెర్చ్​ చేస్తే యష్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్​ తదితరుల పేర్లతో పాటు బాలయ్య పేరు కూడా ఉంది. ఇనాయత్ ఖలీ పాత్రలో ఆయన నటిస్తున్నారని గూగుల్ చూపిస్తోంది. దీనిని చూసిన పలువురు నెటిజన్లు.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వలన అది వైరల్ గా మారింది.  భారీ బడ్జెట్​తో పాన్ ఇండియా కథతో ‘కేజీఎఫ్ 2’ చిత్రాన్ని తీస్తున్న విషయం తెలిసిందే. జనవరి 8న యష్ పుట్టినరోజు కానుకగా టీజర్​ను రిలీజ్ చేయనున్నారు.

Also Read :

Crime News : దొంగలేమో అనుకున్నారు..మూకుమ్మడిగా దాడిచేశారు..చివరికి ఊహించని విషాదం…

Raja singh VS Silpa Chakrapani: ‘ఎనీ టైమ్ నేను రెడీ..రాజీనామాకు నువ్వు రెడీనా’..రాజాసింగ్‏కు శిల్పా చక్రపాణి సవాల్