ఉదయం 3 గంటల సమయంలో ఇంత అందంగా ఎవరు ఉంటారు.. మహేష్‌ ఫొటో షేర్ చేసిన నమ్రత

TV9 Telugu Digital Desk

TV9 Telugu Digital Desk | Edited By:

Updated on: Nov 18, 2020 | 2:34 PM

కొందరు హీరోలను చూస్తే వాళ్ల వయస్సు పెరుగుతుందా..? తగ్గుతుందా..? అన్న అనుమానం కచ్చితంగా వస్తుంటుంది. అలాంటి హీరోల్లో టాలీవుడ్‌లో మహేష్‌ బాబు ఒకరు

ఉదయం 3 గంటల సమయంలో ఇంత అందంగా ఎవరు ఉంటారు.. మహేష్‌ ఫొటో షేర్ చేసిన నమ్రత

Mahesh Babu new look: కొందరు హీరోలను చూస్తే వాళ్ల వయస్సు పెరుగుతుందా..? తగ్గుతుందా..? అన్న అనుమానం కచ్చితంగా వస్తుంటుంది. అలాంటి హీరోల్లో టాలీవుడ్‌లో మహేష్‌ బాబు ఒకరు. ఈ హీరోకు 45 ఏళ్లు అంటే ఎవ్వరూ నమ్మరు. అందం విషయంలో ఇప్పుడిప్పుడు వస్తోన్న కుర్ర హీరోలకు సైతం గట్టి పోటీని ఇస్తోన్న మహేష్‌ తాజా ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీ షర్ట్‌, గ్లాసెస్‌తో మహేష్‌ ఉన్న ఫొటోను ఆయన భార్య నమత్ర తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. (నూతన్ నాయుడుకు బెయిల్.. సెంట్రల్‌ జైలు నుంచి విడుదల)

ఉదయం 3 గంటల సమయంలో ఇంత అందంగా ఎవరు ఉంటారు. ఫ్లైట్‌కి వెయిట్ చేస్తున్నప్పడు ఒక అందమైన వ్యక్తి మీ ముందు ఉంటే సమయం కూడా ఎలా గడిచిపోతుందో తెలీదు అని నమ్రత పోస్ట్‌ చేశారు. ఇక ఈ ఫొటోకు మహేష్ ఫ్యాన్స్ కూడా వావ్‌.. సూపర్‌స్టార్ అంటూ తమ కామెంట్లు పెడుతున్నారు. కాగా కరోనా బ్రేక్ తరువాత ఇప్పటికే అందరు హీరోలు సెట్స్ మీదకు వెళ్లారు. ఈ క్రమంలో ఫ్యామిలీ ట్రిప్‌కి వెళ్లి తిరిగొచ్చిన మహేష్‌ బాబు కూడా త్వరలోనే షూటింగ్‌ని ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ హీరో పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాటలో నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మహేష్‌ బాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తుండగా.. థమన్ సంగీతం అందించనున్నారు. (‘ఆర్‌ఆర్‌ఆర్’‌కి చిన్న బ్రేక్‌.. ఫ్యామిలీతో దుబాయ్‌కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్‌)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

https://www.instagram.com/p/CHrHnnij5gr/?utm_source=ig_embed

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu