మధుర ఆలయంలో నమాజ్, నలుగురిపై పోలీసు కేసు

మధురలోని నంద్ బాబా ఆలయంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు నమాజ్ చేయడం, మరో ఇద్దరు దాన్ని ఫోటోలు  తీయడం సంచలనం రేపింది. దీనిపై అయోధ్యలోని సంత్ సమాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయోధ్య హనుమాన్ గర్హి నిర్వాణి అఖారా కార్యదర్శి మహంత్ గౌరీ శంకర్ దాస్ ప్రభృతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయంలో నమాజ్ చేయడం పెద్ద కుట్ర అని వారు విరుచుకపడ్డారు. ఫైజల్ ఖాన్, చాంద్ మహమ్మద్ అనే […]

  • Umakanth Rao
  • Publish Date - 6:53 pm, Mon, 2 November 20
మధుర ఆలయంలో నమాజ్, నలుగురిపై పోలీసు కేసు

మధురలోని నంద్ బాబా ఆలయంలో ఇటీవల ఇద్దరు వ్యక్తులు నమాజ్ చేయడం, మరో ఇద్దరు దాన్ని ఫోటోలు  తీయడం సంచలనం రేపింది. దీనిపై అయోధ్యలోని సంత్ సమాజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అయోధ్య హనుమాన్ గర్హి నిర్వాణి అఖారా కార్యదర్శి మహంత్ గౌరీ శంకర్ దాస్ ప్రభృతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆలయంలో నమాజ్ చేయడం పెద్ద కుట్ర అని వారు విరుచుకపడ్డారు. ఫైజల్ ఖాన్, చాంద్ మహమ్మద్ అనే వ్యక్తులు ఈ ఆలయంలో నమాజ్ చేయగా.. అలోక్ రతన్, నీలేష్ గుప్తా అనేవారు… వారి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు. కొందరు మతం పేరిట సమాజంలో ఉద్రిక్తతలు రేపేందుకు ఈ విధమైన అకృత్యాలకు పాల్పడుతున్నారని యూపీ మంత్రి శ్రీకాంత్ శర్మ అన్నారు. పోలీసులు ఈ నలుగురిపై కేసు పెట్టారు.