Health Tips: మీ గోర్లు తరచుగా విరుగుతున్నాయా..? రంగు మారుతున్నాయా.. అయితే తస్మాత్ జాగ్రత్త

ఆరోగ్యం బాగుండాలంటే.. శుభ్రత పాటించాలి. అవును.. చేతులు ద్వారానే మనం అన్ని పనులు చేస్తాం. వివిధ వస్తువులను ముట్టుకుంటాం. ఆపై ఏం తినాలన్నా చెయ్యి ద్వారానే నోట్లోకి వెళ్లాలి. 

Health Tips: మీ గోర్లు తరచుగా విరుగుతున్నాయా..? రంగు మారుతున్నాయా.. అయితే తస్మాత్ జాగ్రత్త
Nail Health
Ram Naramaneni

|

Feb 27, 2022 | 1:40 PM

White Spots In Nails: ఆరోగ్యం బాగుండాలంటే.. శుభ్రత పాటించాలి. అవును.. చేతులు ద్వారానే మనం అన్ని పనులు చేస్తాం. వివిధ వస్తువులను ముట్టుకుంటాం. ఆపై ఏం తినాలన్నా చెయ్యి ద్వారానే నోట్లోకి వెళ్లాలి.  ఈ క్రమంలో చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. రకరకాల సూక్ష్మజీవులు, వైరస్‌లు, వ్యాధి కారకాలు చేతులు ద్వారానే మన శరీరంలోకి వెళ్తాయి. అందుకే కరోనా సమయంలో పదే, పదే చేతులు శుభ్రం చేసుకోమని ఆరోగ్య నిపుణులు సూచించారు. కాగా చేతులు కడిగినప్పటికీ.. గోర్లలో మలినాలు దాగుండే అవకాశం ఉంది. అందుకే  ఎప్పటికప్పుడు గోర్లను తొలగించుకోవాలి. కాగా ఇక్కడే ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడిస్తున్నారు నిపుణులు..  మీ గోళ్ల ఆకృతి, రంగు మీ ఆరోగ్య పరిస్థితిని తెలియజేస్తాయట. మీ చేతి గోర్లు రంగు మారినా(Nail Disorders), మచ్చలు ఏర్పడినా.. చివరికి బొడిపెలు, గీతలు వంటివి ఏర్పడినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచింది.  గోళ్లలో వచ్చే మార్పులు.. అనేక రకాల వ్యాధులను సూచిస్తాయి. మీ గోర్లలో ఎలాంటి మార్పులు దేనిని సూచిస్తుందో.. ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

  1. గోరు రంగు పసుపుగా మారితే అది ఫంగల్ ఇన్ఫెక్షన్‌కు సంకేతం. ఇది కాకుండా, థైరాయిడ్, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధిని కూడా సూచిస్తుంది. నెయిల్ పాలిష్ ఎక్కువగా ఉపయోగించినా, అతిగా స్మోకింగ్ చేసినా.. ఈ సమస్య ఏర్పడుతుంది.
  2.  కొంతమందికి గోళ్లపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నిబట్టి మీ శరీరంలో విటమిన్ బీ, ప్రొటీన్, జింక్ లోపం ఉందని అర్థం చేసుకోవచ్చు. తెల్లగా ఉండే ఈ మచ్చలు గోళ్లపై కనిపిస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
  3.  మీ శరీరంలో ఎక్కడో మంట లేదా లూపస్ వ్యాధి ఉంటే, మీ గోళ్ల రంగు మారవచ్చు. అటువంటి పరిస్థితిలో ఎరుపుగా మారే అవకాశం ఉంది.
  4.  గోరులో నీలం, నలుపు మచ్చలు ఉంటే, శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. రక్త ప్రసరణ సక్రమంగా లేకపోవడంతో గోరులో నలుపు లేదా నీలం మచ్చలు ఏర్పడతాయి. కొంతమంది గుండె జబ్బులు వచ్చిన తర్వాత కూడా గోళ్ల రంగు మారే అవకాశం ఉంది.
  5.  కొంతమందికి గోరు మధ్యలో చిన్న గుంటలా ఏర్పడతాయి. ఇలాంటి గోర్లు కలిగిన వ్యక్తులు రీటర్స్ సిండ్రోమ్ అనే కణజాల రుగ్మతతో బాధపడే చాన్సస్ ఉంటాయి. సొరియాసిస్ సమస్యతో బాధపడేవారి గోళ్లపై కూడా ఇలాంటి గుంతలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.
  6. గోర్లపై నల్ల మచ్చలు ఏర్పడటం లేదా గోర్లు నల్ల రంగులో మారుతున్నట్లయితే చాలా ప్రమాదకర సూచిక అని డాక్టర్లు చెబుతున్నారు. ఆ గోర్ల నుంచి ఒక్కోసారి రక్తం కూడా కారుతుంది. ఇది మెలనోమా అనే ఒక రకమైన క్యాన్సర్‌కు ముందస్తు సిగ్నల్ కావచ్చు.
  7. గోళ్లు విరగడం నరాలకు సంబంధించిన సమస్యలను సూచిస్తుంది. శరీరంలో విటమిన్ బి-12 లోపం ఉన్నప్పుడు కణాలు సరిగ్గా ఏర్పడక నాడీ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండక అనేక సమస్యలు మొదలవుతాయి.

(గమనిక: అందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించాలి.)

Also Read: గుండెపోటుకు ముందు కనిపించే సంకేతాలు ఇవే.. ఈ సమయాల్లో జాగ్రత్త

అందంతో గుండెల్లో హీట్ పుట్టించగలదు.. శివంగిలా ఫైట్ చేయగలదు.. ఎవరో గుర్తించారా..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu