నాగార్జునసాగర్‌ నుంచి 4 గేట్ల ద్వారా నీటి విడుదల

ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణ న‌దిలోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతుంది. శ్రీశైలం నుంచి వస్తున్న వ‌ర‌ద‌ ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో నాగార్జునసాగర్ ఉప్పొంగుతోంది.

నాగార్జునసాగర్‌ నుంచి 4 గేట్ల ద్వారా నీటి విడుదల
Follow us

|

Updated on: Aug 21, 2020 | 12:59 PM

ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు కృష్ణ న‌దిలోకి భారీగా వ‌ర‌ద నీరు చేరుతుంది. శ్రీశైలం నుంచి వస్తున్న వ‌ర‌ద‌ ప్రవాహం భారీగా పెరుగుతుండటంతో నాగార్జునసాగర్ ఉప్పొంగుతోంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం పది గేట్లు ఎత్తి నీటిని కింద‌కు విడుద‌ల చేస్తున్నారు. తాజాగా నాగార్జునసాగర్‌ నాలుగు గేట్లు అయిదు అడుగుల మేర ఎత్తి దిగువన ఉన్న పులిచింతలకు నీటీని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు 3.45లక్షల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో వ‌స్తోండ‌గా, 29,712 క్యూసెక్కుల నీటిని దిగువకు రిలీజ్ చేస్తున్నారు.

ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు ప్రస్తుత నీటిమట్టం 583.20 అడుగులు

సాగర్‌ పూర్తిస్థాయి నీటి నిల్వ 312.04 టీఎంసీలు ప్ర‌స్తుత నీటి నిల్వ 289.3600 టీఎంసీలు

Also Read :

వాహనదారులకు బ్యాడ్ న్యూస్ : మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర !

గోమాత‌కు గాయం, హెలికాప్టర్ ద్వారా తరలించిన రైతు

 అలెర్ట్‌ : నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు