బీజేపీ గూటికి మాజీ సీఎం..

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కాషాయం కండువా వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై ఆయన స్పందిస్తూ బీజేపీలో చేరాలని చాలా రోజుల నుంచి ఒత్తిడి ఉందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తన కొడుకు మనోహర్ పార్టీ మార్పు పై నిర్ణయం తీసుకుంటారని నాదెండ్ల భాస్కర్‌రావు అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. శంషాబాద్‌లోని కేఎస్సీసీ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్‌షా […]

బీజేపీ గూటికి మాజీ సీఎం..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 06, 2019 | 6:08 PM

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కాషాయం కండువా వార్తలు వినిపిస్తున్నాయి. దీని పై ఆయన స్పందిస్తూ బీజేపీలో చేరాలని చాలా రోజుల నుంచి ఒత్తిడి ఉందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన తర్వాత తన కొడుకు మనోహర్ పార్టీ మార్పు పై నిర్ణయం తీసుకుంటారని నాదెండ్ల భాస్కర్‌రావు అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. శంషాబాద్‌లోని కేఎస్సీసీ కన్వెన్షన్ సెంటర్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అమిత్‌షా ప్రారంభిస్తారు. రంగారెడ్డి జిల్లా వహాడీషరీఫ్ సమీపంలో ఉన్న మామిడివల్లి గ్రామం రంగనాయకుల తండా గిరిజన మహిళా సోనికి పార్టీ తొలి సభ్యత్వాన్ని అందజేస్తారు. అనంతరం తెలంగాణ పార్టీ కోర్ కమిటీ నేతలతో అమిత్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా అమిత్ షా ఆధ్వర్యంలో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు బీజేపీలో చేరబోతున్నారు.

గుంటూరు జిల్లా కొల్లూరు మండలం దోనేపూడిలో 1935 జూన్‌ 23న జన్మించిన నాదెండ్ల రాజకీయ జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 వరకూ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1983లో ఎన్టీఆర్‌తో కలిసి టీడీపీ స్థాపనలో కీలకపాత్ర పోషించానని చెప్పే నాదెండ్ల అదే ఏడాది టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1984లో ఎన్టీఆర్‌ను పీఠం నుంచి దింపేసి సీఎం అయ్యారు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు… అంటే కేవలం నెల రోజులు మాత్రమే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తిరిగి 1998లో తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆ తరువాత దశాబ్ద కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా బీజేపీలో చేరబోతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ స్పీకర్‌గా పనిచేసిన ఆయన కుమారుడు మనోహర్‌ ప్రస్తుతం జనసేనలో ముఖ్యనేతగా ఉన్నారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..