దోమలతో పొంచిఉన్న ముప్పు.. ఇప్పటికే 20 మంది మృతి..

ఓ వైపు కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతుంటే.. మరోవైపు మాయన్మార్‌కు కరోనాతో పాటుగా మరో ముంపు వచ్చిపడింది. తాజాగా దేశంలో అక్కడ కరోనా కేసులతో పాటుగా.. డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే..

  • Tv9 Telugu
  • Publish Date - 4:08 am, Sun, 19 July 20
దోమలతో పొంచిఉన్న ముప్పు.. ఇప్పటికే 20 మంది మృతి..

ఓ వైపు కరోనా మహమ్మారితో యావత్ ప్రపంచం వణికిపోతుంటే.. మరోవైపు మాయన్మార్‌కు కరోనాతో పాటుగా మరో ముంపు వచ్చిపడింది. తాజాగా దేశంలో అక్కడ కరోనా కేసులతో పాటుగా.. డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఇరవై మంది మరణించారు. మరో 2,862 కేసులు నమోదయ్యాయి. దీంతో డెంగ్యూ రాకుండా అప్రమత్తంగా ఉండాలంటూ
మాయన్మార్‌ ఆరోగ్య, క్రీడా మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

దేశంలోని ఇరవై పట్టణాల్లో ఈ డెంగ్యూ కేసులు అత్యధికంగా ఉన్నాయని.. ఈ ప్రాంతాల్లో పన్నెండు మంది డెంగ్యూ బారినపడి మరణించారని అధికారులు తెలిపారు. అంతేకాదు.. 1,069 డెంగ్యూ కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేశారు. దోమల వ్యాప్తి పెరుగుతుండటంతో.. ఈ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు మరింత దోమల నియంత్రణకు ప్రయత్నిస్తూ.. మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. కాగా, గతేడాది కూడా దోమకాటుతో డెంగ్యూ బారినపడి దాదాపు వంద మంది మరణించారు. అంతేకాదు.. 24,345 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.