వరద బాధితులకు మైహోం గ్రూపు రూ.5 కోట్ల విరాళం

అతిభారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ మహానగరంలోని వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించింది మై హోం సంస్థ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు...

వరద బాధితులకు మైహోం గ్రూపు రూ.5 కోట్ల విరాళం
Follow us

|

Updated on: Oct 20, 2020 | 4:43 PM

My Home Group contributes Rs. 5 Cr for flood relief measures in Hyderabad: అతిభారీ వర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ మహానగరంలోని వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించింది మై హోం సంస్థ. తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 5 కోట్ల రూపాయలు వరద బాధితుల సహాయార్థం ఇస్తున్నట్లు మై హోం సంస్థ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలన్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు హైదరాబాద్ నగరానికి చెందిన కార్పొరేట్ సిటిజన్‌‌గా తన వంతు బాధ్యతతో ఈ విరాళం ఇస్తున్నట్లు రామేశ్వర్ రావు తెలిపారు.

గత పది రోజులుగా తరచూ కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరంలో వరద నీరు పోటెత్తిన సంగతి తెలిసిందే. వందలాది కాలనీలు వరద నీటిలో మగ్గిపోతున్నాయి. వందేళ్ళ తర్వాత ఇంతలా కురిసిన వర్షాలతో మహానగర ప్రజలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ముఖ్యంగా తూర్పు, దక్షిణ హైదరాబాద్ వరద తాకిడితో అల్లాడుతోంది. చినుకు పడితే భయంతో వణికిపోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 14 ఒకసారి, 19న మరోసారి వరద పరిస్థితిని సమీక్షించి, సహాయ చర్యలపై కీలక ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతీ ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మై హోం గ్రూపు సంస్థల అధినేత జూపల్లి రామేశ్వర్ రావు స్పందించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్)కి 5 కోట్ల రూపాయలు వరద సాయంగా ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వరద బాధితులకు చేయూతనందించేందుకు కృషి చేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్లను ఆయన అభినందించారు. వరద బాధితులకు త్వరితగతిన ఉపశమనం లభించాలని రామేశ్వర్ రావు ఆకాంక్షించారు.

Also read: వరద సాయంపై జగన్ కీలక ఆదేశాలు

Also read: ఏపీ స్కూళ్ళలో కోవిడ్ ఆంక్షలివే.. స్వయంగా చెప్పిన సీఎం

గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
'అట్లుంటది బెంగళూరుతోని’.. థియేటర్‌లో వర్క్ ఫ్రం హోం, ఫొటో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
తమలపాకును దిండు కింద పెట్టి పడుకుంటే అద్భుత లాభాలు..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
వారెవ్వా..! మల్లేశ్వరి సినిమాలో చిన్నారి.. మెంటలెక్కిస్తోందిగా..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..
అంబులెన్స్‎కు దారిచ్చిన సీఎం జగన్.. భద్రతా సిబ్బందిపై ప్రశంసలు..