మూడు రకాలుగా కరోనా వైరస్… గత మూడు నెలల్లో జన్యు క్రమంలో మార్పులు..?

మూడు రకాలుగా కరోనా వైరస్... గత మూడు నెలల్లో జన్యు క్రమంలో మార్పులు..?

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్ గుండ్రంగా బంతిలా ఉంటుందనీ, దాని చుట్టూ ముళ్లలాగా ఉంటాయని మనకు తెలుసు. ఈ ఆకారంలో ఎలాంటి

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 11, 2020 | 1:02 PM

కరోనా కరాళ నృత్యానికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా వైరస్ గుండ్రంగా బంతిలా ఉంటుందనీ, దాని చుట్టూ ముళ్లలాగా ఉంటాయని మనకు తెలుసు. ఈ ఆకారంలో ఎలాంటి మార్పూ రాకపోయినా… కరోనా వైరస్ బాడీలోని జన్యువుల్లో మాత్రం కొన్ని మార్పులు వచ్చాయి. చైనాలోని వుహాన్‌ నగరంలో 2019లో తొలి కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటివరకు కొవిడ్‌-19లో ఎలాంటి జన్యుమార్పులు వచ్చాయో తెలుసుకునేందుకు బ్రిటన్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారు.

దీనిలో భాగంగా వారు చాలా దేశాల్లో డిసెంబరు 24 నుంచి మార్చి 4 వరకు 160 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. ఆయా శాంపిళ్లలో వైరస్ ఎలా ఉంది? దాని జన్యువుల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి అన్నది పరిశీలించారు. జస్ట్ 2 నెలల గ్యాప్‌లో కరోనా వైరస్ జన్యువుల్లో మూడు రకాల మార్పులు వచ్చాయి. అంటే… వాటిని మూడు రకాల కరోనా వైరస్‌లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాటికి A, B, C అనే పేర్లు పెట్టారు. A రకం వైరస్… ముందుగా చైనాలో మొదలైంది. ఆ తర్వాత వైరస్‌లో రెండు రకాల జన్యుమార్పులు వచ్చాయి. ఫలితంగా బి వైరస్ మొదలైంది. ఆ తర్వాత మరో మార్పుతో… C రకం వైరస్ వచ్చింది.

కాగా.. A రకం కరోనా వైరస్‌ చైనాలో వచ్చినా… ఆ తర్వాత అది ఎక్కువకాలం అక్కడ ఉండలేదు. అమెరికా, ఆస్ట్రేలియాకు వెళ్లిపోయింది. అందువల్ల వుహాన్‌లో A రకం వైరస్ పెద్దగా కనిపించలేదు. అదే సమయంలో అమెరికా, ఆస్ట్రేలియాలో అదే ఎక్కువగా ఉంది. B రకం కరోనా వైరస్ చైనాతోపాటు మంగోలియా, ఉత్తర కొరియా, దక్షిణకొరియా, జపాన్‌, హాంకాంగ్‌ దేశాలకు పాకింది. C రకం కరోనా వైరస్‌… ఇటలీ, స్వీడన్, ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల్లో ఉంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu