“రాబిన్‌హుడ్‌ ఆఫ్‌ బీహార్” ఈ సాంగ్ ఇప్పుడక్కడ ఫేమస్‌

వీఆర్‌ఆస్‌కు దరఖాస్తు చేసుకున్న బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండేకు అభిమానులు పెరిగిపోయారు. రాబిన్‌హుడ్‌ ఆఫ్‌ బీహార్‌ అంటూ ఆయనపై వీడియోసాంగ్‌ విడుదల అయ్యింది...

  • Sanjay Kasula
  • Publish Date - 3:40 pm, Wed, 23 September 20
"రాబిన్‌హుడ్‌ ఆఫ్‌ బీహార్" ఈ సాంగ్ ఇప్పుడక్కడ ఫేమస్‌

వీఆర్‌ఆస్‌కు దరఖాస్తు చేసుకున్న బీహార్‌ డీజీపీ గుప్తేశ్వర్‌ పాండేకు అభిమానులు పెరిగిపోయారు. రాబిన్‌హుడ్‌ ఆఫ్‌ బీహార్‌ అంటూ ఆయనపై వీడియోసాంగ్‌ విడుదల అయ్యింది. సింగర్‌ దీపక్‌ ఠాకూర్‌ ఈ వీడియోను విడుదల చేశారు. గుప్తేశ్వర్‌ పాండే బీహార్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి . అయితే ఆ వార్తల్లో నిజం లేదని ప్రజాసేవ చేయడానికి ఎన్నికల్లో పోటీ చేయడం అవసరం లేదంటున్నారు గుప్తేశ్వర్‌ పాండే.

సుశాంత్‌ సింగ్‌ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన గుప్తేశ్వర్‌.. ఆ కేసు దర్యాప్తు కోసం ముంబై వెళ్లిన తర్వాత వార్తల్లోకొచ్చారు. ఇక అంతకుముందు 2009లో కూడా బక్సర్‌ లోక్‌సభ సీటుకు పోటీ చేసేందుకు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. అయితే టికెట్‌ లభించకపోవడంతో తిరిగి విధుల్లోకి చేరారు.

మరోవైపు గుప్తేశ్వర్‌ పాండే వీఆర్‌ఎస్‌ తీసుకోవడంపై విమర్శలు ఎక్కుపెట్టారు సుశాంత్‌ సింగ్‌ కేసులో రియా తరపు న్యాయవాది సతీష్‌ మానోషిండే. కేంద్రప్రభుత్వమే డీజీపీ గుప్తేశ్వర్‌ను వీఆర్‌ఎస్‌ తీసుకునేలా ఒత్తిడి చేసిందన్నారు.

అయితే తన వీఆర్‌ఎస్‌పై వస్తున్నవార్తలను కొట్టిపారేశారు గుప్తేశ్వర్‌ పాండే. తనపై ఏ పార్టీ ఒత్తిడి లేదన్నారు. తనకు పాలిటిక్స్‌ వెళ్లే ఆలోచన లేదని.. ఏ పార్టీలో జాయిన్‌ అవడం లేదని స్పష్టంచేశారు. తాను ప్రజా సేవకే అంకితమవుతానని వెల్లడించారు.