మేము ఒకటి ప్రయోగిస్తే.. భారత్ 20 ప్రయోగిస్తుంది : ముషార్రఫ్

భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయన్నారు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్. మేము భారత్ పై ఒక అణుబాంబును ప్రయోగిస్తే.. భారత్ మాపై 20అణుబాంబులను వేస్తుందని అన్నారు. ఇటీవల యూఏఈలో మాట్లాడుతూ ముషార్రఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని పాక్ పత్రిక డాన్ ప్రచురించింది. పాక్,భారత్ మధ్య అణుయుద్ధం సంభవించకపోవచ్చు. కానీ ఒక వేళ మేము భారత్‌పై ఒక అణుబాంబును ప్రయోగిస్తే ఖచ్చితంగా భారత్‌ మాపై 20 అణుబాంబులను ప్రయోగిస్తుందని ముషార్రఫ్ అన్నారు. ఇలా […]

మేము ఒకటి ప్రయోగిస్తే.. భారత్ 20 ప్రయోగిస్తుంది : ముషార్రఫ్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:50 PM

భారత్‌-పాక్‌ మధ్య సంబంధాలు ప్రమాదకర స్థితిలో ఉన్నాయన్నారు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్. మేము భారత్ పై ఒక అణుబాంబును ప్రయోగిస్తే.. భారత్ మాపై 20అణుబాంబులను వేస్తుందని అన్నారు. ఇటీవల యూఏఈలో మాట్లాడుతూ ముషార్రఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని పాక్ పత్రిక డాన్ ప్రచురించింది. పాక్,భారత్ మధ్య అణుయుద్ధం సంభవించకపోవచ్చు. కానీ ఒక వేళ మేము భారత్‌పై ఒక అణుబాంబును ప్రయోగిస్తే ఖచ్చితంగా భారత్‌ మాపై 20 అణుబాంబులను ప్రయోగిస్తుందని ముషార్రఫ్ అన్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే మేము భారత్‌పై 50 అణుబాంబులతో దాడి చేయాలి. అప్పుడే భారత్‌ మాపై 20 అణుబాంబులతో దాడిచేయకుండా ఉంటుంది. మీరు 50 అణుబాంబులతో దాడికి సిద్ధమేనా? అని ముషార్రఫ్‌ పాక్‌ పాలకులను ప్రశ్నించారు.