ధోని సరిగ్గా 19.29కి తన రిటైర్మెంట్ ప్రకటించింది ఇందుకే.!

భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. నిన్న అంతర్జాతీయ క్రికెట్‌కు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని గుడ్ బై చెప్పాడు.

ధోని సరిగ్గా 19.29కి తన రిటైర్మెంట్ ప్రకటించింది ఇందుకే.!
Follow us

|

Updated on: Aug 17, 2020 | 12:45 AM

MS Dhoni Choose 19.29 To Retire: భారత క్రికెట్ చరిత్రలో ఒక శకం ముగిసింది. నిన్న అంతర్జాతీయ క్రికెట్‌కు మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని గుడ్ బై చెప్పాడు. ఈ విషయాన్ని తన అభిమానులకు ధోని ఇన్‌స్టా పోస్ట్ ద్వారా వెల్లడించాడు. ”నా కెరీర్ ఆసాంతం అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు. 19.29 నుంచి నేను రిటైర్ అయినట్లు భావించండి” అని ధోని పేర్కొన్నాడు. ధోని రిటైర్మెంట్‌పై ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నా.. నిన్న అది కూడా 19.29కి రిటైర్ ఎందుకు అయ్యాడు అని అందరిలోని ఓ ప్రశ్న మెదులుతోంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది.

రాముడు వెంటే లక్ష్మణుడు అనేలా నిన్న ధోని రిటైర్మెంట్ ప్రకటించిన కొద్దిసేపటికే రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు అల్విదా పలికిన సంగతి తెలిసిందే. ఇక వీరి ఇరువురి జెర్సీ నెంబర్లు 7, 3.. ఈ రెండింటిని కలిపితే 73 అవుతుంది. నిన్న భారత్ 73 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుని 74వ ఏటలో అడుగుపెట్టింది. అందుకే వీరు వీడ్కోలు పలికారు. ఇక ధోని సరిగ్గా 19.29కి తన రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం గతేడాది వన్డే ప్రపంచకప్ ఓటమి.. అప్పుడు భారత్ 19.29కి న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఇక ధోని నిన్న ఆ టైంకి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే కారణం.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..

జగన్ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతున్నట్లుంది: హీరో రామ్