30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలనుకుంటున్నాః రఘురామకృష్ణంరాజు

ఏపీలో రాజకీయం మరో మలుపు తిరుగుతోంది. అధికార వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పార్టీలో కుల రాజకీయాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. మరింత స్వరం పెంచారు. పార్టీలో కొన్ని కులాలకే ప్రాధాన్యం ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, MLAలు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. ఆయన్ని పార్టీలోకి రమ్మని ఎవరూ […]

  • Ravi Kiran
  • Publish Date - 8:13 pm, Tue, 16 June 20
30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉండాలనుకుంటున్నాః రఘురామకృష్ణంరాజు

ఏపీలో రాజకీయం మరో మలుపు తిరుగుతోంది. అధికార వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పార్టీలో కుల రాజకీయాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. జగన్ ప్రభుత్వంపై కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న ఆయన.. మరింత స్వరం పెంచారు. పార్టీలో కొన్ని కులాలకే ప్రాధాన్యం ఉందంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఇక రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు, MLAలు స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు.

ఆయన్ని పార్టీలోకి రమ్మని ఎవరూ కోరలేదని.. ఆయన బ్రతిమాలాడుకుంటే జగన్ దయ తలచి తీసుకున్నారని వైసీపీ నేతలు గుర్తు చేశారు. నిజంగా ఆయన గొప్ప నాయకుడు అయితే రాజీనామా చేసి గెలవాలని రఘురామకృష్ణంరాజుకు వైసీపీ నేతలు సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలకు రఘురాంకృష్ణంరాజు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ‘సింహం సింగల్‌గానే వస్తుంది. పందులే గుంపులు గుంపులుగా వస్తాయంటూ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చారు. అంతేకాక మంత్రి పేర్ని నానిపై ధ్వజమెత్తారు.

‘అత్మసాక్షిగా చెబుతున్నా.. జగన్ అపాయింట్‌మెంట్‌ నేను అడగలేదు. జగన్ బొమ్మ ద్వారా అయితే అప్పుడే గెలిచేవాడిని, జగన్ వల్ల గెలవలేదంటూ రఘురాం కృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఆ MLAలు రాజీనామా చేస్తే పోటికీ తాను సిద్దమని ఛాలెంజ్ విసిరారు. ఇలా ఆయన ఈ వివాదంపై టీవీ9 బిగ్ న్యూస్ బిగ్ డెబిట్ వేదికగా ఎంపీ రఘురామకృష్ణంరాజు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ అంటే తనకు పిచ్చి ప్రేమ అని.. ప్రశాంత్ కిషోర్ వచ్చి తనతో మాట్లాడాడని చెప్పుకొచ్చారు. ‘గుండెల మీద చెయ్యి వేసుకుని చెబుతున్నా.. జగన్ తోనే ఉండాలనుకుంటున్నా. 30 ఏళ్లపాటు జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానని రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రజా సమస్యలపై ప్రస్తావిస్తే పార్టీ వ్యతిరేకి అని అంటున్నారు. ఇప్పుడు మాట్లాడే ఎమ్మెల్యేలెవ్వరూ కూడా నన్ను పార్టీలోకి ఆహ్వానించలేదని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారో కింద వీడియోలో చూడండి.