కేంద్ర హోంశాఖ కార్యదర్శితో వైసీపీ ఎంపీ భేటీ… అందుకేనా…!

కేంద్ర హోంశాఖ కార్యదర్శితో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. తన వ్యక్తిగత భద్రత గురించి అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తోంది.  గతంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.., ప్రాణహాని ఉందని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు లేఖలో తనకు కేంద్ర భద్రత బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. అంతే కాకుండా తనకు కొందరితో ప్రాణహాణి ఉందని అందులో పేర్కొన్నారు. ఎంపీ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్… ఆ లేఖను కేంద్ర […]

కేంద్ర హోంశాఖ కార్యదర్శితో వైసీపీ ఎంపీ భేటీ... అందుకేనా...!

కేంద్ర హోంశాఖ కార్యదర్శితో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు భేటీ అయ్యారు. తన వ్యక్తిగత భద్రత గురించి అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తోంది.  గతంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.., ప్రాణహాని ఉందని లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు లేఖలో తనకు కేంద్ర భద్రత బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. అంతే కాకుండా తనకు కొందరితో ప్రాణహాణి ఉందని అందులో పేర్కొన్నారు.

ఎంపీ ఫిర్యాదును పరిశీలించిన స్పీకర్… ఆ లేఖను కేంద్ర హోంశాఖకు పంపించారు. దీంతో హోంశాఖ కార్యదర్శి ఎంపీని పిలిచి మాట్లాడారు.  ఇప్పుడు తాజాగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి నుంచి పిలుపు రావడంతో ఆయనను ఎంపీ రఘురామకృష్ణంరాజు కలిశారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శితో ఎంపీ సమావేశం కావడం ఏపీలో చర్చకు దారితీసింది.