కుక్కకు డీఎన్ఏ టెస్ట్‌..పోలీసులు చేయిస్తున్నారు..ఎందుకో చదవండి !

నేను ఆయన కొడుకునే, కావాలంటే డీఎన్‌ఏ టెస్టు చేయండి. ప్రముఖుల తనయులుగా చెప్పుకుంటూ చాలామంది ఇలా మీడియా ముందు హడావిడి చేసిన ఘటనలు చూశాం.

కుక్కకు డీఎన్ఏ టెస్ట్‌..పోలీసులు చేయిస్తున్నారు..ఎందుకో చదవండి !
Follow us

|

Updated on: Nov 22, 2020 | 3:03 PM

నేను ఆయన కొడుకునే, కావాలంటే డీఎన్‌ఏ టెస్టు చేయండి. ప్రముఖుల తనయులుగా చెప్పుకుంటూ చాలామంది ఇలా మీడియా ముందు హడావిడి చేసిన ఘటనలు చూశాం. కొందరు కోర్టు మెట్లు ఎక్కి మరీ డీఎన్‌ఏ టెస్టుల చేయించుకున్న సందర్భాలు చూశాం. కానీ కుక్కకు డీఎన్‌ఏ టెస్టు చేసిన సందర్భం ఎప్పుడైనా చూశారా..అలాంటి వింత మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జరిగింది. ఆ టెస్టు ఎందుకు చేశారో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే..మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన గోల్డెన్ సిలికాన్ ప్రాంతంలో నివశించే జర్నలిస్ట్ షాదాబ్ ఖాన్ 3 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న త‌న లాబ్ర‌డార్ బ్రీడ్‌కు చెందిన కోకో అనే పేరు గల పెట్ డాగ్ మిస్సయిందని ఆగ‌స్టు నెలలో పోలీసుల‌కు కంప్లైంట్ చేశాడు. ఈ క్రమంలో ఇటీవల మ‌లాఖెది ఏరియాకు చెందిన ఏబీవీపీ లీడర్ కార్తీక్ శివ‌హ‌రె నివాసంలో స‌రిగ్గా అలాంటి కుక్కే తారసపడింది. దీంతో షాదాబ్ ఖాన్ ఆ కుక్క త‌న‌దేన‌ని, దాన్ని తనకు అప్పగించాలాని కోరాడు. అందుకు కార్తీక్ నో చెప్పాడు. ఆ కుక్క తాను కొనుగోలు చేశానని..తాని పేరు టైగర్ అని వివరించాడు. పంచాయితీ తేలకపోవడంతో పోలీసులు సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

విచారణలో షాదాబ్ ఆ కుక్క‌ను 2017లో పాక్‌మ‌ర్హిలో కొన్నాన‌ని చెప్పగా.. కార్తీక్ దాన్ని ఇటీవల ఇటార్సీలోని బ్రీడ‌ర్ నుంచి కొనుగోలు చేశానని చెప్పాడు. దీంతో పోలీసులకు ఆ పెట్ డాగ్ ఎవరిదో గుర్తించడం కష్టంగా మారింది. ఈ క్రమంలో వారు కుక్కకు డీఎన్‌ఏ టెస్టు చేయాలని డిసైడయ్యారు. ఆ రిపోర్టును ఈ ఇద్దరు వ్యక్తులు కొనుగోలు చేసిన చోట..తల్లిదండ్రులతో పోల్చనున్నారు. దీంతో అది ఎవరి కుక్కో తేలిపోతుంది. అయితే ఈ విష‌యం మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్