బండి ఒకరిది నెంబర్ మరొకరిది.. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘిస్తున్న అక్రమార్కులు.. అసలు యజమానికి తప్పని తిప్పలు

Traffic Rules: వాహన యజమానులకు కొత్త సమస్య వచ్చి పడింది. తాము రహదారి నిబంధనలు ఉల్లంఘించకున్నా తమ పేరుపై

  • uppula Raju
  • Publish Date - 12:14 pm, Sun, 17 January 21
బండి ఒకరిది నెంబర్ మరొకరిది.. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘిస్తున్న అక్రమార్కులు.. అసలు యజమానికి తప్పని తిప్పలు

Traffic Rules: వాహన యజమానులకు కొత్త సమస్య వచ్చి పడింది. తాము రహదారి నిబంధనలు ఉల్లంఘించకున్నా తమ పేరుపై ఈ చాలెన్లు వస్తున్నాయని లబోదిబోమంటున్నారు. దీనికి కారణం ఏంటంటే కొంతమంది అక్రమదారులు తమ వాహనాలపై వేరొకరి వాహనాల నెంబర్లు రాయించుకని యథేచ్ఛగా రోడ్డు నిబంధనలు ఉల్లంఘించడమే. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఫొటోలు తీసి నెంబర్ ఆధారంగా చాలెన్లు పంపిస్తున్నారు. దీంతో ఇంటికి వచ్చిన ఈ చాలెన్లను చూసి అసలు వాహన యజమానులు కంగుతింటున్నారు.

తామెప్పుడు రహదారి నిబంధనలను ఉల్లంఘించలేదని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు చుట్టూ తిరుగుతున్నారు. వేరేవారు చేసిన తప్పులకు తామెందుకు బాధ్యత వహిస్తామని నిలదీస్తున్నారు. అంతేకాకుండా తమ నెంబర్లతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారికి ట్రాఫిక్ పోలీసులు ఏం సమాధానం చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే అన్ని ఠాణాల పరిధిలో కానిస్టేబుళ్లు వివిధ కూడళ్లలో నిలబడి ఫొటోలు తీయడమే పనిగా పెట్టుకుంటున్నారని, ట్రాఫిక్‌ క్లియరెన్స్‌ సైతం గాలికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పటిలాగే వాహనాలు తనిఖీలు చేస్తేనే అసలు వ్యక్తులు ఎవరనే విషయం తెలుస్తుందని కొంతమంది వాదిస్తున్నారు.

ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై డైరెక్ట్‌గా కారెక్కించాడు.. ఆపకుండా చాలా దూరం ఈడ్చుకెళ్లాడు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నవీడియో..