కేంద్రం రూల్స్: రూపురేఖలు మారనున్న బస్సు, లారీలు

ఎట్టకేలకు కేంద్రం కొత్త రవాణా విధానానికి ఆమోదం తెలిపింది. ట్రక్కుల ఎత్తు పెంపుతో పాటు బస్సుల్లో సీట్లను పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను తీసుకువస్తోంది. దీంతో 20 శాతం మేర వాహన సామర్థ్యం పెరగనుంది.

  • Balaraju Goud
  • Publish Date - 4:07 pm, Wed, 8 July 20
కేంద్రం రూల్స్: రూపురేఖలు మారనున్న బస్సు, లారీలు

ఎట్టకేలకు కేంద్రం కొత్త రవాణా విధానానికి ఆమోదం తెలిపింది. ట్రక్కుల ఎత్తు పెంపుతో పాటు బస్సుల్లో సీట్లను పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను తీసుకువస్తోంది. దీంతో 20 శాతం మేర వాహన సామర్థ్యం పెరగనుంది.

రవాణా రంగంలో కొత్త విధానాలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వాహనాల పొడవు, వెడల్పు, ఎత్తుల్లో మార్పులు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ రెండేళ్లుగా కసరత్తు చేస్తోంది. ఇది ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది. నూత విధానంలో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల సంఖ్య, లారీల్లో సరకు రవాణా సామర్థ్యం పెరగనున్నాయి. ఈ మార్పులు పాఠశాల బస్సులకు కూడా వర్తించనుంది. కొత్త విధానం వాహన రంగానికి ఆర్థికంగా వెసులుబాటు లభిస్తుందని భావిస్తున్నారు. సామర్థ్యం పెరిగినప్పటికీ ఇంజనుపై ఎలాంటి అదనపు భారం పడబోదని కేంద్రం స్పష్టం చేసింది.

అటు ఆర్టీసీ అధికారులు కూడా బస్సు సీట్ల కసరత్తు మొదలు పెట్టారు. దీంతో ప్రతి బస్సులో అదనంగా 20 శాతం వరకు పెంచుకునేలా ఫ్లాన్ చేస్తోంది. ఏకకాలంలో ఎక్కువ మంది ప్రయాణికులను చేరవేసేందుకు వీలు కలుగనుంది. అయితే, కొత్తగా తయారుచేసే బస్సులకు మాత్రమే ఈ మార్పులు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. బస్సుల తయారీ కంపెనీలు ఇంజిన్‌, ఛాసిస్‌ మాత్రమే విక్రయిస్తాయి. బస్‌ బాడీ బిల్డింగ్‌ యూనిట్లతో బాడీ తయారు చేస్తారు. కొత్త విధానంలో బస్సులను రూపొందిస్తామని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఇక, లారీల ఎత్తు పెంచటంతో ఎక్కువ మోతాదులో సరకు రవాణాకు వీలవుతుంది. అటు, లారీల్లో పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు కనుక, పాత వాటికి కూడా ఎత్తు పెంచుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని లారీ యజమానులు కోరుతున్నారు.