ఆగస్టు 28,29న ఆకాశంలో అరుదైన దృశ్యాలు..!

ఆగస్టు చివర్లో ఆకాశంలో అరుదైన దృశ్యం చోటుచేసుకోనుంది. స్కైవాచర్స్‌కు కనువిందు చేయనున్నాయి. సౌరవ్యవస్థలోనే అత్యంత ప్రకాశవంతమైన, అతిపెద్ద గ్రహం బృహస్పతి(గురుడు), రెండో అతిపెద్ద గ్రహం శని చంద్రుడి దగ్గరగా రానున్నాయి.

ఆగస్టు 28,29న ఆకాశంలో అరుదైన దృశ్యాలు..!
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2020 | 3:43 PM

ఆగస్టు చివర్లో ఆకాశంలో అరుదైన దృశ్యం చోటుచేసుకోనుంది. స్కైవాచర్స్‌కు కనువిందు చేయనున్నాయి. సౌరవ్యవస్థలోనే అత్యంత ప్రకాశవంతమైన, అతిపెద్ద గ్రహం బృహస్పతి(గురుడు), రెండో అతిపెద్ద గ్రహం శని చంద్రుడి దగ్గరగా రానున్నాయి. ఈ దృగ్విషయాన్ని కంజక్షన్‌ అంటారు. ఆగస్టు 28న గురుగ్రహం, చంద్రుడికి అత్యంత సమీపంగా వస్తుంది. 29వ తేదీన శనిగ్రహం చందమామ దగ్గరగా వెళ్తుంది. ఆ రోజు ఆకాశం స్పష్టంగా ఉంటే ఎలాంటి పరికరాలు లేకుండా ఈ దృగ్విషయాన్ని వీక్షించవచ్చు. చిన్న టెలిస్కోప్‌ ఉంటే ఇంకా క్లియర్‌గా చూడవచ్చు.

Read More:

ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు.. 16 సెంటీమీటర్లకు పైగా..!

ప్రభుత్వ షెల్టర్ హోమ్‌లో 90 మంది బాలికలకు కరోనా!