కబ్జాల ఎంపీగారి అసలు బాగోతం ఇదే..

రేవంత్ రెడ్డి పేరు ప్రస్తుతం తెలుగు స్టేట్స్‌లో మారుమోగిపోతుంది. భూ కబ్జాల నుంచి వ్యవహారం మనీ లాండరింగ్ వైపు టర్న్ అయ్యింది. కేటీఆర్ గెస్ట్ హౌజ్‌పై డ్రోన్ ఎగరేసి సొంత పార్టీ నేతల నుంచే చివాట్లు తిన్న రేవంత్..ప్రస్తుతం జైల్లో చిప్పకూడు తింటున్నారు.  అయితే ప్రస్తుతం బయటపడుతోన్న రేవంత్ అక్రమాల చిట్టా చూస్తుంటే ఆయనకు జైలే పర్మనెంట్ అడ్రస్ అయ్యేలా కనిపిస్తోంది. ప్రస్తుతం మనీలాండరింగ్ వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంది. అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన సొమ్మను […]

కబ్జాల ఎంపీగారి అసలు బాగోతం ఇదే..
Follow us

|

Updated on: Mar 15, 2020 | 7:03 PM

రేవంత్ రెడ్డి పేరు ప్రస్తుతం తెలుగు స్టేట్స్‌లో మారుమోగిపోతుంది. భూ కబ్జాల నుంచి వ్యవహారం మనీ లాండరింగ్ వైపు టర్న్ అయ్యింది. కేటీఆర్ గెస్ట్ హౌజ్‌పై డ్రోన్ ఎగరేసి సొంత పార్టీ నేతల నుంచే చివాట్లు తిన్న రేవంత్..ప్రస్తుతం జైల్లో చిప్పకూడు తింటున్నారు.  అయితే ప్రస్తుతం బయటపడుతోన్న రేవంత్ అక్రమాల చిట్టా చూస్తుంటే ఆయనకు జైలే పర్మనెంట్ అడ్రస్ అయ్యేలా కనిపిస్తోంది.

ప్రస్తుతం మనీలాండరింగ్ వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంది. అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన సొమ్మను ఆయన వైట్ చేసుకునేందుకు ఉత్తుత్తి కంపెనీలకు ఊపిరి ఊదారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. అయితే కేవలం ఒకటి, రెండు కంపెనీలకు పరిమితం కాలేదు. ఏకంగా 29 కంపెనీలు పెడితే కానీ ఆయన ఆస్తులు లెక్క సెట్టవ్వలేదు. పార్టీ ఏదైనా ఓవర్ చేసి బుక్కయ్యే రేవంత్, మరోసారి బలమైన ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు.  కంపెనీలు కాగితాలపై సృష్టించడం, కొన్నాళ్లు కాగానే ఆ కంపెనీలను మూసేయడంలో రేవంత్‌ మాస్టర్‌మైండ్‌ అనే అంశం ఇప్పుడు క్రమంగా వెలుగులోకి వస్తోంది.

రేవంత్‌రెడ్డి సోదరులు తిరుపతిరెడ్డి, కొండల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జగన్‌రెడ్డి ఈ ఉత్తుత్తి  కంపెనీల్లో డైరెక్టర్లు. రేవంత్‌ మామ పద్మనాభరెడ్డి, ఆయన కొడుకు జయప్రకాష్‌రెడ్డి, రేవంత్ భార్య గీతారెడ్డి, రేవంత్‌ కూతురు నైమిషారెడ్డి పేర్లు ఈ పేపర్‌ కంపెనీల్లో కనిపిస్తాయి. ఇక నైమిషారెడ్డి భర్త గోలుగూరి సత్యనారాయణరెడ్డి, ఆమె మామ శ్రీరామరెడ్డి, వెంకటరెడ్డి, రామకృష్ణారెడ్డి కూడా రేవంత్‌ షెల్‌ కంపెనీల్లో ఉన్నారు. అలాగే గోలుగూరి రాధ, లక్ష్మీపార్వతి, వీరవెంకట నాగ సత్యప్రభ పేర్లు కూడా కంపెనీల్లో కనిపిస్తాయి. కానీ ఈ 29 కంపెనీల్లో ఎక్కడా రేవంత్‌రెడ్డి పేరు కనిపించదు. అసలు వీళ్లందరికీ ఈ కంపెనీల పేర్లు కూడా తెలుసా అన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే అంతచిత్రంగా ఉన్నాయి కంపెనీలు, వాటి నామ్‌కే వాస్తే వ్యాపారాలు. ఇన్‌ఫ్రా, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణరంగం, అగ్రి, సాఫ్ట్‌వేర్‌, ఫుడ్‌, మైనింగ్‌, పెట్రోలియం ప్రొడక్ట్స్‌, ఫార్మా, మోటార్స్‌, ఎడ్యుకేషన్‌, బీమా బ్రోకరేజీ వ్యాపారాలు రేవంత్‌ ఫ్యామిలీకి ఉన్నాయని డాక్యుమెంట్లు చెబుతున్నాయి.

ఈ కంపెనీల పేర్లు ఒక్కసారి పరిశీలిద్దాం. శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌, శ్రీ సాయి మౌర్య ఇన్‌ఫ్రా, బిల్డర్స్‌ ప్రైడ్‌ ఎస్టేట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌, విజయ మగధ ప్రాజెక్ట్స్‌ అంఢ్ ఇన్‌ఫ్రా, అవలాంచెస్‌ ఇన్ఫోటెక్‌, స్టూడియో 7 సాఫ్ట్‌వేర్‌ సర్వీసెస్‌, ఫ్రిక్షన్‌ సాఫ్ట్‌వేర్‌, ఆర్‌పిఎఎస్ సొల్యూషన్స్‌, వార్టీస్‌ ఇన్‌ప్రా, ఎస్వీఆర్ నిర్మాణ్‌, కీ సాఫ్ట్‌ ఐటీ, స్టూడియో ఫెవర్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెంట్స్‌, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పాలిమర్స్‌, సాయి రోజా కన్‌స్ట్రక్షన్స్‌, విఎస్‌ఆర్ డెవలపర్స్‌, విజయ ఏరో బ్లాక్స్‌, లార్స్‌ ఫెర్రో అల్లాయెస్‌, కామరూన్‌ ఫుడ్స్‌, నైమిషా మైనింగ్‌, న్యూట్రెంట్‌ మెరైన్‌ ఫుడ్స్‌, నావెల్టీ రెడ్డి అండ్‌ రెడ్డి మోటార్స్‌, నెక్సస్‌ ఫీడ్స్‌, నాన్సీ ఇండస్ట్రీస్‌, లేఖ్యా మోటార్స్‌, అగ్రిటెక్‌ ఇంటర్నేషనల్‌, రియల్‌ గ్రో ఎగ్జిమ్స్‌, అనిల్‌ కృష్ణ ఇన్సూరెన్స్ బ్రోకరేజీ, నాన్సీ ఎగ్జిమ్స్‌, నక్షత్ర ఫీడ్స్‌, నియో ప్రైడ్‌ ఫార్మా.

రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌, ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారులు ఒక్కసారి రంగంలోకి దిగితే, ఈ కంపెనీల గుట్టు అంతా వీడిపోతోంది. ఏ కారణం లేకుండా ఇన్ని కంపెనీలు కాగితాలమీద సృష్టించారంటే, అందుకు కారణం మనీలాండరింగ్‌ ఉండొచ్చన్న అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ మనీలాండరింగ్‌ కార్యకలాపాలు ఉన్నాయంటే, రేవంత్‌కు ఆ అనుమానాస్పద డబ్బులు ఎక్కడినుంచి వస్తున్నాయి అన్నదే అసలు పాయింట్‌. ఒక్కసారి కదలిక వచ్చిందంటే రేవంత్‌ చీకటి వ్యాపారాలు, మనీలాండరింగ్‌ బాగోతాలు కూకటివేళ్లతో బయటకు వస్తాయి. కబ్జాలు, ఫోర్జీలు, బ్లాక్‌మెయిల్స్‌ వంటి పనులు చేసే రేవంత్‌ మీద ఇప్పటికే 63 కేసులున్నాయి. ఇప్పుడు కొత్తగా షెల్‌ కంపెనీలంటూ ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. షెల్‌ కంపెనీలు పెట్టి దోపిడీ చేసిన ఘనులు పోతే విదేశాలకు పోయారు.. లేకపోతే జైల్లో చిప్పకూడు తింటున్నారు. ప్రజా ప్రతినిధి ముసుగేసుకుని ఏం చేసినా చెల్లుతుందనే టైపు రేవంత్‌ది. ఏది ఏమైనా మనీ లాండరింగ్ వరకు వెళ్లిన ఎంపీగారి వ్యవహారం రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది.

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!