ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మోహన్‌బాబు.. క్లారిఫికేషన్ ఇచ్చిన పీఆర్ టీం

ఏపీ ఫిలిండెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా తనను నియమించినట్లు వస్తున్న వార్తలను ప్రముఖ నటుడు మోహన్ బాబు తోసిపుచ్చారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మోహన్‌బాబును నియమించారన్న వార్తల్లో నిజం లేదని, అలాంటిది ఏదైనా ఉంటే అధికారికంగా వెల్లడిస్తామని ఆయన పీఆర్‌ టీం వెల్లడించింది. ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ వారు పేర్కొన్నారు. కాగా నామినేటెడ్ పదవులకు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మోహన్ బాబును నియమించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం […]

ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మోహన్‌బాబు.. క్లారిఫికేషన్ ఇచ్చిన పీఆర్ టీం
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2019 | 8:35 AM

ఏపీ ఫిలిండెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా తనను నియమించినట్లు వస్తున్న వార్తలను ప్రముఖ నటుడు మోహన్ బాబు తోసిపుచ్చారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మోహన్‌బాబును నియమించారన్న వార్తల్లో నిజం లేదని, అలాంటిది ఏదైనా ఉంటే అధికారికంగా వెల్లడిస్తామని ఆయన పీఆర్‌ టీం వెల్లడించింది. ఇలాంటి వార్తలను నమ్మకండి అంటూ వారు పేర్కొన్నారు. కాగా నామినేటెడ్ పదవులకు ఏపీ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని.. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా మోహన్ బాబును నియమించనున్నారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే గతంలోనూ మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్‌ పదవి ఇవ్వబోతున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని ఖండించిన ఈ నటుడు.. జగన్ గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశానే తప్ప.. తాను ఎలాంటి పదవి ఆశించలేదని సోషల్ మీడియాలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.