రంజాన్ బిర్యానీ పంపించాను తీసుకోండి…

రవి భాయ్‌.. బిర్యానీ పంపించా తీసుకోండి అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ. అంతకుముందు తన అభిమానులకు, సహచర క్రికెటర్లకు సోషల్ మీడియా వేదికగా ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు

రంజాన్ బిర్యానీ పంపించాను తీసుకోండి...
Follow us

|

Updated on: May 26, 2020 | 3:56 PM

రవి భాయ్‌.. బిర్యానీ పంపించా తీసుకోండి అంటూ ట్వీట్ చేశాడు టీమిండియా స్టార్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ. అంతకుముందు తన అభిమానులకు, సహచర క్రికెటర్లకు సోషల్ మీడియా వేదికగా ఈద్ శుభాకాంక్షలు తెలిపాడు. కరోనా ప్రభావంతో రంజాన్ పండుగను ఇంటి వద్దే జరుపుకున్న షమీ… తన ఆత్మీయులతో రంజాన్ విందును షేర్ చేసుకోవాలనుకున్నాడు. తన ఆత్మీయులకు కోసం వినూత్నంగా ఆలోచించాడు. ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా వారి ఇంటికే రంజాన్ ఫుడ్‌ను పంపించారు.

మటన్‌ బిర్యానీ, సేమియా పాయసం, డెజర్ట్స్‌ను టీమిండియా చీఫ్ కోచ్‌ రవిశాస్త్రికి షమీ ప్రత్యేకంగా పంపించాడు. రవి భాయ్.. సేమియా పాయసం, మటన్ బిర్యానీ, డెజర్ట్స్‌లను ప్యాక్ చేసి పంపించాను. కొద్దిసేపట్లో మీ దగ్గరికి వస్తుంది. స్వీకరించండి’ అంటూ షమీ ట్వీట్‌ చేశాడు.