జమ్మూకశ్మీర్‌లో షూటింగ్ చేయండి..టాలీవుడ్‌కు ప్రధాని విజ్ఞప్తి

ఆర్టికల్‌ 370 అమలు ద్వారా వేర్పాటువాదం, అవినీతి, కుటుంబ పాలన మినహా జమ్మూకశ్మీర్‌కు ఒరిగిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసగించిన విషయం తెలిసిందే.  అయితే మోదీ స్పీచ్‌లో అనూహ్యంగా టాలీవుడ్ పేరు వినిపించింది. ఇప్పుడు బాలీవుడ్ తర్వాత తెలుగు సినిమాలకే అంత క్రేజ్.. డిమాండ్.. మార్కెట్ ఉన్నాయి. దాంతో ఇప్పుడు మన సినిమా గురించి మోదీ మాట్లాడారు. ఇక ఇందులో భాగంగానే కశ్మీర్, లఢఖ్‌లలో […]

జమ్మూకశ్మీర్‌లో షూటింగ్ చేయండి..టాలీవుడ్‌కు ప్రధాని విజ్ఞప్తి
Follow us

|

Updated on: Aug 09, 2019 | 1:23 AM

ఆర్టికల్‌ 370 అమలు ద్వారా వేర్పాటువాదం, అవినీతి, కుటుంబ పాలన మినహా జమ్మూకశ్మీర్‌కు ఒరిగిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుకు సంబంధించి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసగించిన విషయం తెలిసిందే.  అయితే మోదీ స్పీచ్‌లో అనూహ్యంగా టాలీవుడ్ పేరు వినిపించింది. ఇప్పుడు బాలీవుడ్ తర్వాత తెలుగు సినిమాలకే అంత క్రేజ్.. డిమాండ్.. మార్కెట్ ఉన్నాయి. దాంతో ఇప్పుడు మన సినిమా గురించి మోదీ మాట్లాడారు.

ఇక ఇందులో భాగంగానే కశ్మీర్, లఢఖ్‌లలో ఇకనుంచి షూటింగ్స్ కూడా చేయాలంటూ విజ్ఞప్తి చేసారు. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాల షూటింగ్స్ ఎలాగూ అక్కడ పెరుగుతాయని.. ఇక తెలుగు, తమిళ ఇండస్ట్రీల షూటింగ్స్ కూడా పెంచాలని ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసారు. జమ్మూకశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో వచ్చి భాగం కావాలంటూ కోరారు. ప్రతీ ఒక్కరు అక్కడ వచ్చి స్వేచ్ఛగా షూటింగ్స్ చేసుకోవాలంటూ  పిలుపునిచ్చారు. అంతేకాదు స్టూడియోలు పెట్టడానికి స్థలాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. దర్శక నిర్మాతలు ఈ విషయంపై ఆలోచించాలని పలు సినిమా ఇండస్ట్రీలను మోదీ కోరారు.