మోదీ స్పీచ్ లో ‘ ఛాత్ పూజ’ ప్రస్తావన…బీహార్ ఎన్నికలపై కన్నేనా ?

రానున్న పండుగల సీజన్ లో దేశంలోని 80 కోట్ల మంది పేద కుటుంబాలకు నవంబరు వరకు ఉచిత రేషన్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన..

  • Umakanth Rao
  • Publish Date - 6:30 pm, Tue, 30 June 20
మోదీ స్పీచ్ లో ' ఛాత్ పూజ' ప్రస్తావన...బీహార్ ఎన్నికలపై కన్నేనా ?

రానున్న పండుగల సీజన్ లో దేశంలోని 80 కోట్ల మంది పేద కుటుంబాలకు నవంబరు వరకు ఉచిత రేషన్ ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. మంగళవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. ఇందుకు 90 వేల కోట్ల వ్యయమవుతుందన్నారు. దీపావళి, ఛాత్ పూజ, వరకు లేదా నవంబరు వరకు ఈ రేషన్ పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రభుత్వం దీన్ని చేపట్ట నుంది . కాగా మోదీ ప్రధానంగా ‘చాత్ పూజ గురించి ప్రస్తావించడం అక్టోబరు లేదా నవంబరు లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యమే అన్నది రాజకీయ పరిశీకుల భావనగా చెబుతున్నారు. బీహార్ లో ఇది అతి పెద్ద పండుగ కూడా. ఆ రాష్ట్రలో పాలక కూటమిలోని భాగస్వామ్య పార్టీలు… ఉపాధి లేకుండా ఉన్న వేలాది వలస కార్మిక కుటుంబాలను కేంద్రం ఏదో  విధంగా ఆదుకోవాలని కోరుతున్నాయి. బహుశా అందుకే మోదీ అటు వారికి సాయపడుతున్నట్టూ ఉంటుందనో,. పైగా ఆ ఎన్నికల్లో అది బీజేపీ విజయానికి బాటలు పరిచినట్టూ ఉంటుందనో ప్రత్యేకంగా ఆ పండుగ గురించి ప్రస్తావించినట్టు చెబుతున్నారు.