ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక అంతే… వాహనదారులకు భారీ షాక్!

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఎన్ని ట్రాఫిక్ నిబంధలు పెట్టినా వాహనదారులు మాట వినకపోవడంతో ఆ రూల్స్ ని మరింత కఠినం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మోటార్ వెహికల్ బిల్లు సవరణకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. దీని ప్రకారం అతివేగం, ఓవర్ లోడింగ్, చిన్న పిల్లలు డ్రైవింగ్ చేయడం, లైసెన్స్ లేకుండా బండి నడపడం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి […]

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఇక అంతే... వాహనదారులకు భారీ షాక్!
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 2:58 PM

కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఎన్ని ట్రాఫిక్ నిబంధలు పెట్టినా వాహనదారులు మాట వినకపోవడంతో ఆ రూల్స్ ని మరింత కఠినం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే మోటార్ వెహికల్ బిల్లు సవరణకు మోదీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది.

దీని ప్రకారం అతివేగం, ఓవర్ లోడింగ్, చిన్న పిల్లలు డ్రైవింగ్ చేయడం, లైసెన్స్ లేకుండా బండి నడపడం, ర్యాష్ డ్రైవింగ్, మద్యం సేవించి వెహికల్ డ్రైవ్ చేయడం వంటి వాటికి భారీ పెనాల్టీలు పడబోతున్నాయి.

జరిమానాలు ఇలా…

  • క్యాబ్, ట్యాక్సీ వంటి సేవలు అందించే అగ్రిగ్రేటర్లు డ్రైవింగ్ లైసెన్స్ రూల్‌ను అతిక్రమిస్తే ఏకంగా రూ.లక్ష వరకు పెనాల్టీ పడుతుంది.
  • అతివేగంతో (ఓవర్ స్పీడ్) వాహనం నడిపితే రూ.1,000 నుంచి రూ.2,000 వరకు చెల్లించుకోవలసి వస్తుంది.
  • రోడ్డుపై ఎవరైనా అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వెహికల్స్‌కు దారి ఇవ్వకపోతే రూ.10,000 పెనాల్టీ చెల్లించాల్సి ఉంది.
  • హెల్మెట్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేస్తే రూ.1,000 జరిమానా ఎదుర్కోవలసి ఉంటుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌పై మూడు నెలలపాటు సస్పెన్సన్ ఉంటుంది.
  • ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.2,000 ఫైన్ కట్టాల్సిందే.
  • మైనర్లు వాహనాన్ని నడిపితే ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తారు. అలాగే వారి సంరక్షుడు లేదా వెహికల్ ఓనర్ మూడేళ్లపాటు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. రూ.25,000 పెనాల్టీ పడుతుంది.
  • ఆర్‌సీ లేకుండా వాహనం నడిపితే రూ.5,000 జరిమానా కట్టాల్సి ఉంటుంది. లైసెన్స్ లేకుండా వెహికల్ డ్రైవ్ చేసినా ఇదే పెనాల్టీ కట్టాలి.
  • ర్యాష్ డ్రైవింగ్‌కు జరిమానా రూ.5,000. మద్యం తాగి వెహికల్ నడిపితే రూ.10,000 కట్టాలి.
  • వెహికల్‌పై ఓవర్‌లోడ్‌తో వెలితే రూ.రూ.20,000 జరిమానా పడుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే రూ.1,000 పెనాల్టీ.