వ్యాక్సిన్ ట్రయల్స్ బ్లూప్రింట్ విడుదల చేసిన మోడెర్నా, ఫైజర్

అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో పురోగాభివృద్ధి సాధించారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి సంబంధించి బ్లూప్రింట్ కూడా విడుదల చేశాయి.

వ్యాక్సిన్ ట్రయల్స్ బ్లూప్రింట్ విడుదల చేసిన మోడెర్నా, ఫైజర్
Follow us

|

Updated on: Sep 18, 2020 | 4:20 PM

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందానని ఆశ ఎదురుచూస్తున్నారు జనం. కోట్లాది మంది రాకాసి వైరస్ కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్నారు. కరోనా తరిమేసేందుకు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచ వ్యాప్తంగా పలు సంస్థలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే రష్యా ఒకడుగు ముందుకేసి వ్యాక్సిన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. తాజాగా అమెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ కంపెనీలు కూడా వ్యాక్సిన్ తయారీలో పురోగాభివృద్ధి సాధించారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి సంబంధించి బ్లూప్రింట్ కూడా విడుదల చేశాయి.

కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని రక్షించేందుకు మెరికాకు చెందిన మోడెర్నా, ఫైజర్ కంపెనీలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. క్లినికల్ ట్రయల్స్ నిర్వహణపై పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నాయి. 135 పేసజీల సమాచారాన్ని కంపెనీలు విడుదల చేశాయి. వ్యాక్సిన్ ట్రయల్స్ లో పాల్గొనే వలెంటీర్స్ ఎంపిక విధానం, వారి వివరాలను రహాస్యంగా ఉంచాలని నిర్ణయించారు. ప్రయోగాల అనంతరం వారి పర్యవేక్షణ, ప్రయోగాల్లో సమస్యలు తలెత్తితే అనుసరించాల్సిన విధానాలపై ఈ బ్లూప్రింట్ లో ప్రస్తావించారు. పొందుపర్చారు. ఈ ప్రయోగాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని గోప్యం ఉంచనుంది. క్లినికల్ ట్రయల్స్ ప్రయోగాలు పూర్తైయ్యాక మాత్రమే వాటిని విడుదల చేయాలని భావిస్తున్నాయి. ప్రయోగాల్లో ఏమైనా తేడాలు వస్తే తీసుకోవల్సిన జాగ్రత్తలపై బ్లూప్రింట్ లో వివరించారు. వ్యాక్సిన్ ను తయారు చేస్తున్న తొమ్మిది కంపెనీల్లో రెండు కంపెనీలు మాత్రమే బ్లూప్రింట్ ను విడుదల చేశాయి.

అయితే, కరోనా నివారణకు తయారు చేస్తున్న వ్యాక్సిన్ కు సంబంధించి పూర్తి ప్రయోగాల ఫలితాలను విశ్లేషించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని మోడెర్నా, ఫైజర్ కంపెనీలు వివరించాయి. ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నాయి. కాగా, మోడెర్నా 30 వేల మందిపై ప్రయోగాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే 25 వేల మందిపై ప్రయోగాలు పూర్తి చేసినట్టుగా ఆ కంపెనీ ప్రకటించింది. ఫైజర్ సంస్థ 44 వేల మందిపై క్రినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.