ఆంధ్ర‌ప్ర‌దేశ్ : పేదల నమూనా గృహాలకు నేడే శ్రీకారం

ఏపీలో పేదలకు ప్రీగా పంపిణీ చేయ‌నున్న ఇళ్లను మోడల్‌ గ్రీన్‌ హౌస్‌ పేరుతో నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు.

  • Ram Naramaneni
  • Publish Date - 12:18 pm, Fri, 14 August 20
ఆంధ్ర‌ప్ర‌దేశ్ : పేదల నమూనా గృహాలకు నేడే శ్రీకారం

YSR Housing Scheme : ఏపీలో పేదలకు ప్రీగా పంపిణీ చేయ‌నున్న ఇళ్లను మోడల్‌ గ్రీన్‌ హౌస్‌ పేరుతో నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. అందుకు సంబంధించిన శాంపిల్ హౌస్‌ల‌ను నేటి నుంచి రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గంలోని జేగురుపాడులో ప్రారంభిచ‌నున్న‌ట్లు పార్ల‌మెంట్ స‌భ్యుడు మార్గాని భరత్‌రామ్ తెలిపారు. ఈ ఇళ్ల‌కు ప్రయోగాత్మకంగా లేటెస్ట్ ఇన్ఫిల్ టెక్నాల‌జీ వినియోగించనున్నట్లు ఆయ‌న వివ‌రించారు.

వెర్టికల్‌ గార్డెనింగ్‌, సోలార్‌ రూఫింగ్‌, కాలుష్య రహిత పరిసరాలతో చూడ‌చక్క‌గా ఉండే ఇళ్ల‌ను నిర్మించ‌నున్నట్లు ఆయ‌న తెలిపారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 30 లక్షల ఇళ్ల నిర్మాణాలు అతి తక్కువ సమయంలో చేపట్టనున్నట్లు వివరించారు. గత లోక్‌సభ సమావేశాల సంద‌ర్భంగా పేదలకు మోడల్‌ గ్రీన్‌హౌస్‌ నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరాన్ని తాను ప్రస్తావించినట్లు ఈ సంద‌ర్భంగా ఎంపీ గుర్తుచేశారు.

 

Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు

 

Also Read : ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ