”నేను వైసీపీ వ్యక్తినే.. జనసేన గాలివాటంగా వచ్చిన పార్టీ”..!

''నేను వైసీపీ వ్యక్తినే.. జనసేన గాలివాటంగా వచ్చిన పార్టీ''..!

జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మరోసారి ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన గాలివాటంగా వచ్చిన పార్టీ అని చెప్పిన ఆయన..

Ravi Kiran

|

Aug 13, 2020 | 1:26 AM

Rapaka Varaprasad Rao Comments: జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మరోసారి ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన గాలివాటంగా వచ్చిన పార్టీ అని చెప్పిన ఆయన.. అది ఎప్పటివరకు ఉంటుందో తెలియదన్నారు. కేవలం పోటీలో ఉండాలి కాబట్టే జనసేనలో చేరారని రాపాక వరప్రసాద్ వెల్లడించారు. జనసేన తరపున గెలిచినా తన ప్రయాణం అంతా వైసీపీతోనే అని ఆయన అన్నారు.

గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసేందుకు యత్నించానని.. బొంతు రాజేశ్వరరావుకు వైసీపీ టికెట్ ఇవ్వడంతో జనసేనలో చేరానని రాపాక చెప్పుకొచ్చారు. కాగా, రాజోలు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ వర్గాల్లో తనదొకటి అని.. సీఎం జగన్ చొరవ తీసుకుని ఒక్కరికే బాధ్యతలు అప్పగించాలి కోరారు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు.. గతంలోనూ ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతేకాకుండా కొన్నిసార్లు తాను జనసేన పార్టీలో ఉన్నా.. పరోక్షంగా తన మద్దతు సీఎం జగన్‌కేనని బహిర్గతం వెల్లడించారు. మరి రాపాక చేసిన ఈ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Also Read: ఏపీలోని ఆ ప్రాంతంలో రెండు వారాల కఠిన లాక్‌డౌన్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu