కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్య‌క్రియ‌లు చేసిన‌ ఎమ్మెల్యే భూమ‌న‌

క‌రోనా వచ్చి మ‌నుషుల్లో ఎంత క‌ల్మ‌షం ఉందో నిరూపించింది. కోవిడ్ సోకిన‌ వ్య‌క్తుల‌పై సొంత కుటుంబ స‌భ్యులు కూడా కూడా వివిక్ష చూపిస్తున్నారు

  • Ram Naramaneni
  • Publish Date - 2:44 pm, Fri, 14 August 20
కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్య‌క్రియ‌లు చేసిన‌ ఎమ్మెల్యే భూమ‌న‌

క‌రోనా వచ్చి మ‌నుషుల్లో ఎంత క‌ల్మ‌షం ఉందో నిరూపించింది. కోవిడ్ సోకిన‌ వ్య‌క్తుల‌పై సొంత కుటుంబ స‌భ్యులు కూడా వివిక్ష చూపిస్తున్నారు. ఇప్ప‌టికే ఇటువంటి ఘ‌ట‌న‌లు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎన్నో చూశాం. తాజాగా తిరుప‌తిలో క‌రోనాతో మృతి చెందిన వ్య‌క్తి అంత్య‌క్రియులు జ‌రిపేందుకు కుటుంబ స‌భ్యులు ముందుకు రాలేదు. దీంతో‌ ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి, నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష స్పందించి ఆ మృతదేహానికి అంతిమ సంస్కార‌లు నిర్వ‌హించారు.

గోవిందదామంలో దహనక్రియలు నిర్వహించిన అనంత‌రం ఎమ్మెల్యే మాట్లాడారు. కోవిడ్ వల్ల చనిపోయిన వారి శ‌రీరంలో 6 గంటల త‌ర్వాత వైర‌స్ ఉండదని ప్రజలకి అవగాహన క‌ల్పించేందుకు తాము ముందుకు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. కరోనా వైరస్‌తో చనిపోయిన వారి దహన క్రియలకు కుటుంబ సభ్యులు రాకపోవడం చాలా బాధించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

 

Also Read : ఏపీ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్ : ఈ నెలలో ఒకేసారి 90 గుడ్లు పంపిణీ

 

Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు