అనాధాశ్రమంలో మైనర్ బాలికపై అత్యాచారం : విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు

అనాధాశ్రమంలో  మైనర్ బాలికపై అత్యాచారం : విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు

సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మారుతీ అనాధాశ్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు 14 ఏళ్ల బాలికకు మత్తుమందిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే.

Ram Naramaneni

|

Aug 14, 2020 | 11:37 AM

Minor girl rape Case : సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్  అనాధాశ్రమంలో ఆశ్రమ నిర్వాహకుడు 14 ఏళ్ల బాలికకు మత్తు మందిచ్చి పలుమార్లు అత్యాచారానికి పాల్పడటంతో..బాలిక చ‌నిపోయిన‌ ఘటన రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన విష‌యం తెలిసిందే. ఈ దారుణానికి వార్డెన్ కూడా స‌హ‌కరించాడు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి చేస్తోన్న విచార‌ణ‌లో కొత్త కోణాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. మరో మైనర్ బాలికపై సైతం నిందితుడు వేణుగోపాల్ లైంగికదాడి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. దీనిపై కుటుంబ సభ్యులు నిలదీయడంతో నిర్వాహ‌ల‌కు బెదిరింపులకు తెగ‌బ‌డిన‌ట్లు తెలుస్తోంది.

సంగారెడ్డి చైల్డ్ వెల్ఫేర్ సభ్యురాలితో నిందితులకు సన్నిహిత సంబంధాలు ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యురాలి సహకారంతో వీరు అక్ర‌మాల‌కు తెగ‌బ‌డిన‌ట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో రెస్కూ చేసిన మైనర్లను ఇక్కడికే పంపాలని సిబ్బందిపై ఒత్తిడి చేశార‌ని స‌మాచారం. ఘ‌టన‌పై వేసిన‌ హైపవర్ కమిటీ విచారణలో ఈ నిజాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో అనాధ ఆశ్రమంలోని 70మందిని అధికారులు విచారించనున్నారు. రాష్ట్రంలోని ఇతర అనాధ ఆశ్రమాల‌లో సైతం తనిఖీలకు అధికారుల ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 400 అనాధ‌ ఆశ్రమాలు, 19వేల మంది అనాధలు ఉన్న‌ట్లు స‌మాచారం.

Also Read : బీజేపీ నేత సాధినేని యామినిపై పోలీసు కేసు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu