చౌటుప్పల్ మున్సిపాలిటీలో రణ రంగం

యాదాద్రి భునవగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక రసాభాసగా సాగింది. ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి, చౌటుప్పల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజు మధ్య వాగ్వాదం చోటు...

చౌటుప్పల్ మున్సిపాలిటీలో రణ రంగం
Follow us

|

Updated on: Aug 07, 2020 | 9:54 PM

యాదాద్రి భునవగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుల ఎంపిక రసాభాసగా సాగింది. ఎంపిక ప్రక్రియలో ఎమ్మెల్యే రాజ్‌గోపాల్‌రెడ్డి, చౌటుప్పల్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమావేశంకు సంబంధించి తేదీ, ఎజెండాను ఖరారు చేసినప్పటికీ…. ఎన్నికను అడ్డుకునేలా ఎమ్మెల్యే దౌర్జన్యానికి దిగినట్టు మున్సిపల్‌ ఛైర్మన్‌ రాజు ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 4వ వార్డు కౌన్సిలర్లు అనూహ్యంగా పార్టీకి ఎదురు తిరగడంతో ఎన్నికలో వివాదం తలెత్తింది. ఆ సభ్యురాలు అయిన విజయలక్ష్మిపై ఛైర్మన్‌ రాజు చేయి చేసుకున్నాడు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి, ఛైర్మన్‌ల మధ్య పరస్పరం ఆరోపణలు చోటుచేసుకున్నాయి. స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు అడ్డుకుని సద్దుమణిచే యత్నం చేశారు. ఆ తర్వాత సభను వాయిదా వేశారు.