Krishna River Board: ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.. కృష్ణా బోర్డును వైజాగ్‌కు తరలించడంపై మంత్రి నిరంజన్ ఫైర్..

Krishna River Board: కృష్ణా బోర్డును వైజాగ్‌కు తరలించడంపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆసంతృప్తి వ్యక్తం చేశారు.

Krishna River Board: ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోంది.. కృష్ణా బోర్డును వైజాగ్‌కు తరలించడంపై మంత్రి నిరంజన్ ఫైర్..
Follow us

|

Updated on: Jan 06, 2021 | 3:05 PM

Krishna River Board: కృష్ణా బోర్డును వైజాగ్‌కు తరలించడంపై తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆసంతృప్తి వ్యక్తం చేశారు. క‌ృష్ణా బోర్డును తరలించాడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ ప్రజలు, అధికారులు కృష్ణా బోర్డును కలవాలంటే విశాఖపట్నం వరకు వెళ్లడం కష్టతరం అని పేర్కొన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం నుంచి వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న వైజాగ్‌లో కృష్ణా యాజామాన్య బోర్డు పెట్టడం ఏంటి? అని మంత్రి నిరంజన్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును తమ నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఏపీకి కృష్ణా బోర్డును తరలించాలనుకుంటే విజయవాడ, కర్నూలు, గుంటూరులో ఎక్కడైనా పెట్టుకోవచ్చునని అన్నారు.

ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపైనా తీవ్రంగా స్పందించారు. 20 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన కుట్ర ఫలితమే ఇప్పటి రాయలసీమ ఎత్తిపోతల పథకం అని వ్యాఖ్యానించారు. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతున్నప్పుడే తాము ఈ విషయంపై నిరసన వ్యక్తం చేశామని నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు. కానీ అప్పటి తెలంగాణ కాంగ్రెస్ నేతలు తమతో కలిసి రాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ కొత్త పథకం కాబట్టి డీపీఆర్ అడిగిందని, కానీ ఏపీ మాత్రం డీపీఐ అంటోందని మంత్రి నిరంజన్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులను ఆపాలని కూడా ఆదేశించిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఏపీ ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తోందన్నారు. కేంద్రం ఆదేశాలను లెక్క చేయకుండా పనులు కొనసాగించడం ఏపీ విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు.

Also read:

Central Govt: జంపన్నవాగుపై కాజ్‌వే నిర్మాణం.. అనుమతులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం..

MLC By-Elections: ఏపీలో ఎమ్మెల్సీ బై-ఎలక్షన్‌కు షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలివే..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు