ప్రారంభానికి ముస్తాబైన కేబుల్ బ్రిడ్జి

ట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారం.. మాదాపూర్ లోని దుర్గం చెరువుపై పర్యాటక హబ్‌గా నిర్మించిన కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది.

ప్రారంభానికి ముస్తాబైన కేబుల్ బ్రిడ్జి
Follow us

|

Updated on: Sep 25, 2020 | 12:08 PM

పద్మవ్యూహం లాంటి హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులకు చెక్‌ పెట్టేందుకు ప్రతిపాదించిన బహుళ మార్గాల వంతెనలు, అండర్‌పా్‌సలు, గ్రేడ్‌ సెపరేటర్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు అండర్‌పాస్‌ అందుబాటులోకి వచ్చాయి. రూ.21 వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రోగ్రామ్ తుది దశకు చేరుకుంది. పర్యావరణ ఇబ్బందులు, ఆస్తుల సేకరణ సమస్య లేకుండానే రహదారుల అభివృద్ధ కార్యాక్రమం చేపడుతోంది జీహెచ్ఎంసీ.

అయితే ఇందులో భాగంగా ట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారం.. మాదాపూర్ లోని దుర్గం చెరువుపై పర్యాటక హబ్‌గా నిర్మించిన కేబుల్‌ వంతెన ప్రారంభోత్సవ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన ప్రారంభోత్సవాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారికంగా ప్రకటించింది. పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు వంతెనను ప్రారంభించనున్నారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ వైపు నుంచి సిగ్నల్‌ చిక్కులు లేని ప్రయాణం కోసం దుర్గం చెరువు, రోడ్‌ నెంబర్‌ -45లో వంతెన నిర్మిస్తున్నారు. రూ.184 కోట్లతో దుర్గం చెరువుపై, రూ.150 కోట్లతో రోడ్‌ నెంబర్‌-45లో వంతెనల పనులు పూర్తయ్యాయి. జంట వంతెనలు నేటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. రోడ్‌ నెంబర్‌-45 నుంచి ఐటీ కారిడార్‌కు సులువైన ప్రయాణానికి సాగించేందుకు వీలవుతుంది. కేటీఆర్‌ వంతెన పనులపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు పర్యాటక హంగులు అద్దేందుకు కీలక సూచనలు చేశారు. అటు రాకపోకలతో పాటు పర్యాటకంగా ఈ బ్రిడ్జిని తీర్చిదిద్దారు. వారంలో ఐదు రోజుల పాటు వాహనాలకు అనుమతినిస్తారు. మిగతా శని, ఆదివారాల్లో మాత్రం ఒక్క పర్యాటకలకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు తెలిపారు. అటు పర్యావరణానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ఈ బ్రిడ్జి నిర్మాణం సాగింది.