కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం-మంత్రి జగదీష్‌రెడ్డి

కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్‌ చట్టం- 2020 తెలంగాణ ప్రభుత్వం మరోమారు వ్యతిరేకించింది. కొత్తగా తీసుకురావాలని చూస్తున్న చట్టంతో...

  • Sanjay Kasula
  • Publish Date - 4:28 pm, Fri, 3 July 20
కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం-మంత్రి జగదీష్‌రెడ్డి

 Minister Jagadeesh Reddy Opposed : కేంద్రం తీసుకువస్తున్న విద్యుత్‌ చట్టం- 2020 తెలంగాణ ప్రభుత్వం మరోమారు వ్యతిరేకించింది. కొత్తగా తీసుకురావాలని చూస్తున్న చట్టంతో ఏ వర్గానికి ఉపయోగం లేదని విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌చట్ట సవరణ ముసాయిదాపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల విద్యుత్‌ శాఖమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది.

విద్యు‌త్‌ సౌధలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ట్రాన్స్‌ కో జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, TSSPDCLC సీఎండీ రఘుమారెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్పష్టం చేసినట్టు మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సబ్సిడీ పొందుతున్న వారితో పాటు రైతులకు గొడ్డలిపెట్టులా విద్యుత్‌ సవరణ బిల్లు ఉందన్నారు మంత్రి.