Bengal Elections ఎంఐఎం పార్టీ అనూహ్య నిర్ణయం.. బెంగాల్ నేతలతో అసద్ భేటీ.. జాతీయ కార్యాచరణలో మరో ముందడుగు

ఎంఐఎం పార్టీ భవిష్యత్ కార్యాచరణలో నిమగ్నమైంది. వచ్చే ఏడు తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా...

Bengal Elections ఎంఐఎం పార్టీ అనూహ్య నిర్ణయం.. బెంగాల్ నేతలతో అసద్ భేటీ.. జాతీయ కార్యాచరణలో మరో ముందడుగు
Follow us

|

Updated on: Dec 12, 2020 | 6:40 PM

MIM party surprising decision: ఎంఐఎం పార్టీ భవిష్యత్ కార్యాచరణలో నిమగ్నమైంది. వచ్చే ఏడు తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. ప్రకటన చేయడమే కాకుండా దానికి అనుగుణంగా సమాలోచనలు కూడా ప్రారంభించారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీ చేయాలని ఎంఐఎం పార్టీ శనివారం నిర్ణయించింది.

తమిలనాడుతోపాటు బెంగాల్ అసెంబ్లీకి వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఇటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉప్పు నిప్పుగా బెంగాల్‌ను భగ్గుమనేలా చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటనకు వెళితే ఆయన టీఎంసీ వర్గాలు రాళ్ళ దాడికి దిగాయి. ఈ విషయంపై  కేంద్ర హోం శాఖ కన్నెర్ర చేసింది. బెంగాల్ రాష్ట్ర డీజీపీని, సీఎస్‌ను ఢిల్లీకి రావాల్సిందిగా తాఖీదు పంపింది. అయితే.. హోం శాఖ తాఖీదును బెంగాల్ అధికారులు తోసి పెట్టారు. బిజీగా వున్నాం.. రాలేమని ఖరాఖండీగా చెప్పేశారు.

ALSO READ: తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపిన జగ్గారెడ్డి కామెంట్లు

తాజా పరిణామాలతో బెంగాల్ రాజకీయలు వేడెక్కుతుంటే దానికి మరింత ఆజ్యం పోసేందుకు రెడీ అవుతోంది ఎంఐఎం పార్టీ. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే పరిమితమైన మజ్లిస్ పార్టీ.. ఆ తర్వాత మహారాష్ట్రలో వేళ్ళూనుకుంది. ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి.. అయిదు సీట్లను గెలుచుకుంది. అదే ఉత్సాహంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లోను పోటీ చేస్తామని అప్పట్లో అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు.

కాగా.. శనివారం హైదరాబాద్ నగరంలోని అసదుద్దీన్ ఓవైసీ నివాసంలో బెంగాల్ నుంచి వచ్చిన ఎంఐఎం నాయకులతో ఆయన భేటీ అయ్యారు. బెంగాల్ తాజా పరిణామాలపై చర్చించారు. బెంగాల్ అసెంబ్లీలో మొత్తం 212 సీట్లుండగా.. ముస్లింలు అధికంగా వున్న 98 నియోజకవర్గాలను ఎంఐఎం గుర్తించినట్లు తెలుస్తోంది. దానికి తోడు సీమాంచల్ సరిహద్దులోని ప్రాంతంలో పార్టీ బలంగా వున్నట్లు అక్కడి ఎంఐఎం పార్టీ వర్గాలు అధినేత ఓవైసీకి వివరించారు. ప్రస్తుతానికి ఎన్ని స్థానాలలో పోటీకి దిగాలన్నది ఇంకా నిర్ణయించనప్పటికీ.. బెంగాల్ అసెంబ్లీలో కనీసం 20 మంది ఎంఐఎం సభ్యులుండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు ఓవైసీ.

ALSO READ: తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపిన జగ్గారెడ్డి కామెంట్లు

సీమాంచల్ ప్రాంతంతోపాటు.. 24 పరగణాలు, అసన్‌సోల్ వంటి ఏరియాల్లో ఎంఐఎం పార్టీకి బలమైన క్యాడర్‌ని డెవలప్ చేసినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో విస్తరించాలన్న సంకల్పంతో ఒక్కో రాష్ట్రంలో అడుగు మోపుతున్న ఎంఐఎం పార్టీకి వచ్చే  సంవత్సరం బెంగాల్, తమిళనాడుల్లో జరగనున్న ఎన్నికలు కీలకంగా మారాయని.. పార్టీని జాతీయ పార్టీగా నిలబెట్టే కార్యాచరణలో అసదుద్దీన్ యాక్షన్ ప్లాన్ వ్యూహాత్మకంగా వుందని రాజకీయ  పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.