మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకిక శాశ్వతంగా ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ?

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తాము కోరుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చునని ఈ సంస్థ ప్రకటించింది. ఈ ఆప్షన్ ను ఇస్తున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ పాండమిక్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు గనుక, వారికి ఆ ఛాయిస్ ఇస్తున్నాం అని ఈ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.  ముఖ్యంగా అమెరికాలో వచ్ఛే ఏడాది జనవరి వరకు మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు తెరిచే అవకాశాలు లేవు.. అందువల్ల ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని శాశ్వతం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నామని […]

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకిక శాశ్వతంగా 'వర్క్ ఫ్రమ్ హోమ్' ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 11, 2020 | 5:18 PM

మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు తాము కోరుకుంటే శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవచ్చునని ఈ సంస్థ ప్రకటించింది. ఈ ఆప్షన్ ను ఇస్తున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ పాండమిక్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు గనుక, వారికి ఆ ఛాయిస్ ఇస్తున్నాం అని ఈ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.  ముఖ్యంగా అమెరికాలో వచ్ఛే ఏడాది జనవరి వరకు మైక్రోసాఫ్ట్ కార్యాలయాలు తెరిచే అవకాశాలు లేవు.. అందువల్ల ‘ఇంటి నుంచి పని’ విధానాన్ని శాశ్వతం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నామని ఆ ప్రతినిధి చెప్పారు. అయితే ఉద్యోగులు ఇంటి పట్టునే ఉండి ఆఫీసు పని చేయదలిస్తే ఆఫీస్ స్పేస్ ను వదులుకోవలసి ఉంటుందట.. అంటే బహుశా ఆఫీసులో తమకు ఉద్దేశించిన కేబిన్ ను ఖాళీ చేయాల్సి ఉంటుందన్న మాట ! తాము పర్మనెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయదలిస్తే ఇందుకు తమ మేనేజర్ల అనుమతిని పొందాల్సిఉంటుంది.