అమెరికాలో టిక్ టాక్ ‘ఆపరేషన్స్’ ని కొంటాం, మైక్రోసాఫ్ట్

అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను తాము 'కొనుగోలు' చేస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ సీఈఓ సత్యనాదెళ్ళకు, అధ్యక్షుడు ట్రంప్ కు మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఇక్కడ ఈ యాప్ కార్యకలాపాలను..

అమెరికాలో టిక్ టాక్ 'ఆపరేషన్స్' ని కొంటాం, మైక్రోసాఫ్ట్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 03, 2020 | 3:21 PM

అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను తాము ‘కొనుగోలు’ చేస్తామని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది. తమ సంస్థ సీఈఓ సత్యనాదెళ్ళకు, అధ్యక్షుడు ట్రంప్ కు మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఇక్కడ ఈ యాప్ కార్యకలాపాలను కొనుగోలు చేయడానికి అవకాశాలున్నాయని ఈ కంపెనీ వర్గాలు తెలిపాయి. అమెరికాలో టిక్ టాక్ ని బ్యాన్ చేస్తామని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో మైక్రోసాఫ్ట్ ప్రతిపాదన  వాయిదా పడింది. కానీ తమ యోచనపై వెనక్కి తగ్గేదిలేదని మైక్రోసాఫ్ట్ వర్గాలు వెల్లడించాయి.

తన మాతృక సంస్థ బైట్ డాన్స్ నుంచి అమెరికాలో టిక్ టాక్ ఆపరేషన్స్ ని వేరు చేయాలని ట్రంప్ ఇటీవల సూచించారు. విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా ట్రంప్ సూచనను సమర్థించారు. అయితే అమెరికాలో టిక్ టాక్ పై మోజు పడుతున్న యువత 60 శాతానికి పైగానే ఉంది. బహుశా ఇందువల్లే మైక్రోసాఫ్ట్ ఇక్కడ ఈ యాప్ కార్యకలాపాలపై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.