వర్క్ ఫ్రమ్ హోమ్, అలసి, సొలసి పోతున్నా, సత్య నాదెళ్ల

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసీ,చేసీ అలసిపోతున్నానని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. లిటరల్ గా చెప్పాలంటే,  ఈ తరహా పని నిద్రావస్థకు గురి చేస్తుందని, అలసటగా అనిపిస్తుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు ఆఫీసు పనిని ఇంటి నుంచే చేస్తున్నారా అని ఎవరైనా అడిగినప్పుడు..అది ఎలా ఉంటుందంటే..మీరు పని చేస్తూనే నిద్ర పోతున్నారా అని  వ్యాఖ్యానించినట్టు ఉంటుందని ఆయన చెప్పారు.  ఇంటి నుంచి ఆఫీసు పని సందర్భంలో వీడియో కాల్స్ వస్తే అది మరింత […]

  • Umakanth Rao
  • Publish Date - 5:32 pm, Sat, 10 October 20
వర్క్ ఫ్రమ్ హోమ్, అలసి, సొలసి పోతున్నా, సత్య నాదెళ్ల

వర్క్ ఫ్రమ్ హోమ్ చేసీ,చేసీ అలసిపోతున్నానని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తెలిపారు. లిటరల్ గా చెప్పాలంటే,  ఈ తరహా పని నిద్రావస్థకు గురి చేస్తుందని, అలసటగా అనిపిస్తుందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు ఆఫీసు పనిని ఇంటి నుంచే చేస్తున్నారా అని ఎవరైనా అడిగినప్పుడు..అది ఎలా ఉంటుందంటే..మీరు పని చేస్తూనే నిద్ర పోతున్నారా అని  వ్యాఖ్యానించినట్టు ఉంటుందని ఆయన చెప్పారు.  ఇంటి నుంచి ఆఫీసు పని సందర్భంలో వీడియో కాల్స్ వస్తే అది మరింత ఘోరమన్నారు. ఓ అరగంట సేపు వీడియో కాల్ మాట్లాడామంటే ఇక నీరసించిపోయినట్టే అన్నారు. కరోనా వైరస్ కారణంగా మైక్రోసాఫ్ట్ సహా గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలు  కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతిని పాటిస్తున్నాయి. కొన్ని కంపెనీలైతే శాశ్వతంగా దీన్ని అమలు చేస్తున్నాయి.