‘ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ నాశనం’..

'ఇమ్రాన్ ఖాన్ వల్లే పాక్ క్రికెట్ నాశనం'..

పాకిస్తాన్ మాజీ ఆటగాడు, ఆ దేశ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ క్రికెట్ కోచ్ జావేద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇమ్రాన్ వల్లే పాక్ క్రికెట్ సర్వ నాశనం అయిందని అతడు ఆరోపించాడు.

Ravi Kiran

|

Aug 13, 2020 | 6:37 PM

Miandad Fired On Imran Khan: పాకిస్తాన్ మాజీ ఆటగాడు, ఆ దేశ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై పాక్ క్రికెట్ కోచ్ జావేద్ మియాందాద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇమ్రాన్ వల్లే పాక్ క్రికెట్ సర్వ నాశనం అయిందని అతడు ఆరోపించాడు. పాక్ క్రికెట్ బోర్డు సభ్యులెవరికీ ఆటలో ఓనమాలు తెలియవని చెప్పిన మియాందాద్.. ప్రస్తుతం ఉన్న పరిస్థితి మారకపోతే యువ ఆటగాళ్ళంతా భవిష్యత్తులో కూలీలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించాడు. తాజాగా యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడిన మియాందాద్ పైవిధంగా వ్యాఖ్యలు చేశాడు.

”ప్రస్తుతం పాక్ క్రికెట్‌లో నెలకొన్న బాధాకరమైన పరిస్థితులు గురించి ఇమ్రాన్‌తో మాట్లాడతా. పీసీబీ ఎలా నడుస్తుందో ప్రధాని తెలుసుకోవాలి. ఆలస్యం కాకుండా చక్కదిద్దాలి. ”నీకే అన్ని తెలుసనుకోకు, గతంలో నేను నీ కెప్టెన్ ని అనే విషయం మర్చిపోకు” అని మియాందాద్ ఇమ్రాన్‌ను ఉద్దేశించి పేర్కొన్నారు.

Also Read:

తెలంగాణలో కొత్తరకం వ్యాధి.. ఆదిలాబాద్‌లో మొదటి కేసు నమోదు.

ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఆ ప్రయాణీకులకు కరోనా పరీక్షలు లేవు..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu