MeWe Social Media: ఫేస్‌బుక్‌కు గట్టి పోటీనిస్తోన్న ‘మీవీ’… ‘మీ వ్యక్తిగత జీవితం అమ్మకానికి కాదంటూ’ ప్రచారం..

MEWE Give Competition To FB: సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ప్రైవసీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకువస్తుందని ప్రకటించన తర్వాత ఈ చర్చ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యతను..

MeWe Social Media: ఫేస్‌బుక్‌కు గట్టి పోటీనిస్తోన్న 'మీవీ'... 'మీ వ్యక్తిగత జీవితం అమ్మకానికి కాదంటూ' ప్రచారం..
Follow us

|

Updated on: Jan 21, 2021 | 12:46 PM

MEWE Give Competition To FB: సోషల్‌ మీడియాలో ప్రస్తుతం ప్రైవసీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరీ ముఖ్యంగా వాట్సాప్‌ కొత్త ప్రైవసీ పాలసీ తీసుకువస్తుందని ప్రకటించన తర్వాత ఈ చర్చ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యతను సంపాదించుకుంది. దీంతో వాట్సాప్‌ యూజర్లు ఒక్కసారిగా యాప్‌ నుంచి బయటకు రావడం ప్రారంభించారు. వాట్సాప్‌.. యూజర్ల సమాచారాన్ని ఫేస్‌బుక్‌కు షేర్‌ చేస్తుందని దీని ద్వారా తమ పర్సనల్‌ కాంటాక్ట్స్‌, లొకేషన్‌ లాంటి సమాచారం ఫేస్‌బుక్‌కు చేరుతుందని ప్రచారం జరిగింది. అయితే దీనిపై వాట్సాప్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినా యూజర్లు మాత్రం పెద్దగా నమ్మట్లేదు. దీంతో టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌ల డౌన్‌లోడ్‌లు విపరీతంగా పెరిగాయి. ఇదిలా ఉంటే తాజాగా ఫేస్‌బుక్‌ను కూడా ఈ ప్రైవసీ అంశం ఇబ్బంది పెడుతోంది. లాస్‌ ఏంజిల్స్‌ వేదికగా నడుస్తోన్న సోషల్‌ మీడియా నెట్‌ వర్క్‌ ‘మీవీ’ (MEWE) ఇప్పుడు శరవేగంగా దూసుకెళుతోంది. ఈ యాప్‌ డౌన్‌లోడ్‌లు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఫేస్‌బుక్‌పై ప్రభావం చూపుతుంది. యాడ్‌ ఫ్రీగా కొనసాగుతోన్న ఈ కొత్త సోషల్‌ మీడియా యాప్‌ ప్లే స్టోర్‌ డౌన్‌లోడింగ్‌ రెండో స్థానంలో కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతం ఈ ప్లాట్‌ ఫాంను 15.5 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌ ఉపయోగిస్తున్న వారిలో 50 శాతం ఉత్తర అమెరికాకు చెందిన వారు ఉండగా, 24 శాతం మంది ఆసియా, మరో 24 శాతం యూరప్‌, 2 శాతం ఆస్ట్రేలియా యూజర్లు ఉన్నారు. యూజర్ల ప్రైవసీకి పెద్ద పీఠ వేస్తున్నట్లు ‘మీవీ’ సంస్థ చెబుతోంది. అంతేకాకుండా ‘మీ వ్యక్తిగత జీవితం అమ్మకానికి కాదు’ అనే ఒక కొత్త నినాదాన్ని ప్రచారాం చేస్తోంది.

Also Read: Hike Messenger: ఈనెల 21 నుంచి నిలిచిపోనున్న హైక్‌ మెసెంజర్‌ సేవలు.. ప్రకటించిన సీఈవో కెవిన్‌ భారతి మిట్టల్‌