స్కూల్ గోడ దూకి మరీ చిట్టీలు.. ఇవేనా ప్రతిభకు సూచికలు!

విద్యార్థుల భవిష్యత్‌కు 10వ తరగతి పరీక్షలు ఎంతో ప్రధానమైనవి. చాలామంది రేపటి గురించి కోటి ఆశలతో ఈ  ఎగ్జామ్స్‌ కోసం సన్నద్దం అవుతూ ఉంటారు. అలాంటి పరీక్షలలో స్వశక్తితో ఎగ్జామ్స్ రాయాల్సిన అభ్యర్థులకు.. కొంతమంది స్కూల్ ప్రహరీగోడ దూకి మరీ చిట్టీలు అందించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర.. యావత్మాల్​ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల వద్ద ఈ దృశ్యాలు కనిపించడంతో కొంతమంది మొబైల్‌లో చిత్రీకరించారు. ఇప్పుడు అవి కాస్తా వైరల్‌గా మారాయి. దీనిపై పరీక్షా కేంద్రం నియంత్రణ […]

స్కూల్ గోడ దూకి మరీ చిట్టీలు.. ఇవేనా ప్రతిభకు సూచికలు!
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 7:38 PM

విద్యార్థుల భవిష్యత్‌కు 10వ తరగతి పరీక్షలు ఎంతో ప్రధానమైనవి. చాలామంది రేపటి గురించి కోటి ఆశలతో ఈ  ఎగ్జామ్స్‌ కోసం సన్నద్దం అవుతూ ఉంటారు. అలాంటి పరీక్షలలో స్వశక్తితో ఎగ్జామ్స్ రాయాల్సిన అభ్యర్థులకు.. కొంతమంది స్కూల్ ప్రహరీగోడ దూకి మరీ చిట్టీలు అందించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర.. యావత్మాల్​ జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాల వద్ద ఈ దృశ్యాలు కనిపించడంతో కొంతమంది మొబైల్‌లో చిత్రీకరించారు. ఇప్పుడు అవి కాస్తా వైరల్‌గా మారాయి.

దీనిపై పరీక్షా కేంద్రం నియంత్రణ అధికారి ఏఎస్​ చౌదరి స్పందించారు. పాఠశాల ప్రహారీ గోడ సక్రమంగా లేకపోవడంతో, ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. దీనిపై పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చామని, ఇంకోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, పరీక్షలు సంక్రమంగా నిర్వహిస్తామని తెలిపారు.