ఓటమిని ఒప్పుకోవయ్యా ! రంగంలోకి దిగిన మెలనియా కూడా !

అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించాలంటూ డిమాండ్ చేస్తున్న ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయన భార్య మెలనియా కూడా చేరింది. నిన్నటికి నిన్న ట్రంప్ అల్లుడు కుష్నర్ వచ్చి.. తన మామగారితో ఇదే విషయమై ప్రస్తావించారు. ఓటమిని ఒప్పుకోవాలని కోరారు. కానీ అందుకు ట్రంప్ గారి నుంచి మౌనమే ఎదురయింది. తాజాగా మెలనియా సైతం తన భర్తను ఇలాగే కోరినట్టు ‘ఇన్నర్ సర్కిల్స్’ తెలిపాయి. ఎన్నిక రిజల్ట్ పై ఆమె బహిరంగంగా ఎలాంటి కామెంట్ […]

ఓటమిని ఒప్పుకోవయ్యా ! రంగంలోకి దిగిన మెలనియా కూడా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 09, 2020 | 11:32 AM

అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ తన ఓటమిని అంగీకరించాలంటూ డిమాండ్ చేస్తున్న ఆయన కుటుంబ సభ్యుల్లో ఆయన భార్య మెలనియా కూడా చేరింది. నిన్నటికి నిన్న ట్రంప్ అల్లుడు కుష్నర్ వచ్చి.. తన మామగారితో ఇదే విషయమై ప్రస్తావించారు. ఓటమిని ఒప్పుకోవాలని కోరారు. కానీ అందుకు ట్రంప్ గారి నుంచి మౌనమే ఎదురయింది. తాజాగా మెలనియా సైతం తన భర్తను ఇలాగే కోరినట్టు ‘ఇన్నర్ సర్కిల్స్’ తెలిపాయి. ఎన్నిక రిజల్ట్ పై ఆమె బహిరంగంగా ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ ఆమె అభిప్రాయం మాత్రం ఇదేనట ! గత నెలలో  మెలనియా…… ట్రంప్ తరఫున ప్రచారం చేశారు. కాగా ఇంతమంది ఇలా పరోక్షంగా ఒత్తిడి చేస్తున్నా ట్రంప్.. గోల్ఫ్ క్రీడ చాటున  తన మౌన వేదనను దాచుకుంటున్నారు. కోర్టు తీర్పులే తనను ‘రక్షిస్తాయని’ కొండంత ఆశతో ఉన్నారు.