Megastar Chiranjeevi: వాళ్ళొస్తారంటూ వీళ్ళ హల్‌చల్.. వాహ్ వాట్ ఏ మెగా ప్లాన్

అమరావతి రాజధాని పరిరక్షణ యువజన జేఏసీ చిరంజీవి మద్దతును కోరుతూ ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తామని ప్రకటించి వెనక్కి తగ్గినప్పటికీ మెగా అభిమానులు మాత్రం తమ అభిమాన నటునికి రక్షణగా నిలబడ్డారు. ఫిబ్రవరి 29న ఉదయాన్నే భారీ సంఖ్యలో చిరంజీవి ఇంటికి తరలి వచ్చి... హల్‌చల్ చేస్తున్నారు. దాంతో భారీ పోలీసుల బలగాలను మోహరించారు ఆ ప్రాంతంలో...

Megastar Chiranjeevi: వాళ్ళొస్తారంటూ వీళ్ళ హల్‌చల్.. వాహ్ వాట్ ఏ మెగా ప్లాన్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 29, 2020 | 2:06 PM

Megastar fans staging dharna at Chiranjeevi residence: అమరావతి రాజధాని సెగ తమ అభిమాన హీరో చిరంజీవికి అంటనీయమంటున్నారు మెగాఫ్యాన్స్. అమరావతి రాజధానికి మద్దతు తెలపాలంటూ చిరంజీవి ఇంటి ముందు ధర్నా చేస్తామని అమరావతి పరిరక్షణ యువజన జేఏసీ ముందుగా ప్రకటించి.. ఆతర్వాత ఆ ధర్నాను ఉపసంహరించుకుంది. కానీ మెగా అభిమానులకు మాత్రం ఏ మూలనో అనుమానం. అమరావతి యువజన జేఏసీ ఏ క్షణమైనా చిరంజీవి ఇంటి ముందు మెరుపు ధర్నాకు దిగవచ్చని మెగా ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు. అందుకే అమరావతి జేఏసీ కంటే ముందే చిరంజీవి ఇంటికి చేరుకుని మెగాస్టార్ జిందాబాద్ అంటూ ధర్నాకు దిగారు.

మెగాస్టార్ చిరంజీవి ఇంటి వద్ద అభిమానులు ఆందోళనకు దిగారు. జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తున్నారు మెగా ఫాన్స్. హైదరాబాద్‌లోని చిరంజీవి ఇంటికి భారీగా చేరుకున్న మెగాస్టార్ అభిమానులు తమ హీరోకు ఏ మాత్రం డామేజీ జరగనీయమంటున్నారు. చిరంజీవి ఇంటి ఎదుట భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అమరావతి రాజధానికి మద్దతు ఇవ్వాలి అని యువజన పరిరక్షణ జాక్ నిరాహారదీక్ష చేపట్టాలని బావించింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో గొడవెందుకని వెనక్కి తగ్గింది. తాము తలపెట్టిన ధర్నాను ఉపసంహరించుకున్నామని ప్రకటించింది జాక్.

కానీ,ఏ టైం లో ఐనా వాళ్ళు (అమరావతి యువజన జాక్) దీక్షను చేయవచ్చు అన్న అనుమానంతో మెగాఫ్యాన్స్ చిరంజీవి ఇంటి ముందు ముందుగానే బైఠాయించారు. మెగా ఫ్యామిలీ జోలికి వస్తే వదలబోమని హెచ్చరిస్తున్నారు. ఫ్యాన్స్ హంగామాతో చిరంజీవి ఇంటి వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.

ఇదీ చదవండి: మెగాస్టార్‌కు అమరావతి సెగ Amaravati heat touched Megastar Chiranjeevi

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు