మ్యాచ్ ఫిక్సింగ్ మాఫియాకు భారత్ ‘అడ్డా’… పాకిస్తాన్ మాజీ పేసర్..

మ్యాచ్ ఫిక్సింగ్ మాఫియాకు భారత్ 'అడ్డా'... పాకిస్తాన్ మాజీ పేసర్..

సందు దొరికితే చాలు పాకిస్తాన్ క్రికెటర్లు ఏదొక విధంగా భారత ఆటగాళ్లపై తమ అక్కసును వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. మొన్న అక్తర్.. నిన్న ఇంజమామ్.. ఇక నేడు అదే కోవలో పాక్ మాజీ పేసర్ ఆకీబ్ జావెద్ ఇండియన్ క్రికెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌ మాఫియాకు భారత్ ప్రధాన అడ్డా మారిందని పాక్ మాజీ పేసర్ అకీబ్ జావెద్ తాజాగా పాకిస్తాన్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలోనే ఐపీఎల్‌పై ఎన్నో […]

Ravi Kiran

|

May 08, 2020 | 12:41 PM

సందు దొరికితే చాలు పాకిస్తాన్ క్రికెటర్లు ఏదొక విధంగా భారత ఆటగాళ్లపై తమ అక్కసును వెళ్ళబుచ్చుకుంటూ ఉంటారు. మొన్న అక్తర్.. నిన్న ఇంజమామ్.. ఇక నేడు అదే కోవలో పాక్ మాజీ పేసర్ ఆకీబ్ జావెద్ ఇండియన్ క్రికెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

మ్యాచ్ ఫిక్సింగ్‌ మాఫియాకు భారత్ ప్రధాన అడ్డా మారిందని పాక్ మాజీ పేసర్ అకీబ్ జావెద్ తాజాగా పాకిస్తాన్ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలోనే ఐపీఎల్‌పై ఎన్నో అనుమానాలు తలెత్తాయని.. అయితే దీనిపై ఎవరూ ప్రశ్నించే ధైర్యం చేయలేదని చెప్పాడు. మ్యాచ్ ఫిక్సింగ్‌కు భారతే ప్రధాన స్థావరమని అతడు వివరించాడు.

ఇక పాకిస్తాన్‌లో ఫిక్సింగ్ గురించి మాట్లాడుతూ.. ‘ పాక్ క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్‌ విషయాలను బహిర్గతం చేసినందుకే తన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయిందని తెలిపాడు నన్ను ముక్కలుగా నరికేస్తామంటూ బెదిరించారని చెప్పాడు. కాగా, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదురుకున్న మహ్మద్ అమీర్‌ను పాక్ క్రికెట్ బోర్డు మళ్లీ జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయం కాదన్నాడు.

Read More:

మెట్రో సర్వీసుల్లో 50% ఆక్యుపెన్సీ.. సిటీ బస్సుల్లో నో స్టాండింగ్!

కిమ్ మరణం వెనుక అసలు రహస్యమిదే.. దేశద్రోహులు గుర్తింపు.. వారికి చావే గతి!

మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. ఇంజనీరింగ్ ఫీజుల జీవో సస్పెండ్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu