పారికర్ ఆరోగ్యంగా ఉన్నారు.. వదంతులు వద్దు

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయనపై వదంతులను వ్యాపించకండి అంటూ ఆ రాష్ట్ర మంత్రి విశ్వజిత్ రాణే స్పందించారు. పారికర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని రాణే అన్నారు. ముఖ్యమంత్రి పారికర్ ఆరోగ్యం విషయంలో వస్తున్న కాల్పిత వార్తలకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నాం. ఆయన ఆరోగ్యంపై అనవసర వదంతులు వ్యాపించకండి. దాని వల్ల వైద్యులపై ప్రజలకు నమ్మకం పోతుంది. నేను ఆయనను కలిశాను. పారికర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పారికర్‌ను […]

పారికర్ ఆరోగ్యంగా ఉన్నారు.. వదంతులు వద్దు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:52 PM

గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయనపై వదంతులను వ్యాపించకండి అంటూ ఆ రాష్ట్ర మంత్రి విశ్వజిత్ రాణే స్పందించారు. పారికర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని రాణే అన్నారు.

ముఖ్యమంత్రి పారికర్ ఆరోగ్యం విషయంలో వస్తున్న కాల్పిత వార్తలకు పుల్‌స్టాప్ పెట్టాలనుకుంటున్నాం. ఆయన ఆరోగ్యంపై అనవసర వదంతులు వ్యాపించకండి. దాని వల్ల వైద్యులపై ప్రజలకు నమ్మకం పోతుంది. నేను ఆయనను కలిశాను. పారికర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. పారికర్‌ను అలా చూసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. రేపటి వరకు ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉంటారు అని గోవా ఆరోగ్య శాఖ మంత్రి రాణే అన్నారు. కాగా కొంతకాలంగాఉదరకోశ వ్యాధితో బాధపడుతున్న పారికర్ పలుచోట్ల చికిత్స పొందిన విషయం తెలిసిందే.